Skip to main content

ఉత్తమ సినిమాలు ఆలోచనా పరిధిని పెంచుతాయి

ఉత్తమ సినిమాలు ఆలోచనా పరిధిని పెంచుతాయి 

• ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నెలకోసారి       ఉచిత సినిమా ప్రదర్శన 
 . సందేశాత్మక చిత్రాలను ప్రోత్సహించాలి 
. కళల కాణాచి తెనాలిలో కల్చరల్ ఫిల్మ్ సొసైటీ కళా     సేవలు అభినందనీయం

 - అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ ప్రారంభ సభలో శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ 

తెనాలి: ఉత్తమ సినిమాలు సృజనాత్మకతతో ఆలోచనా పరిధిని పెంచుతాయని, వినోదంతో పాటు విజ్ఞానంతో రూపొందుతున్న చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. తెనాలి కల్చరల్ ఫిల్మ్ సొసైటీ, చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ, తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానికి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రమ్ లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ఆదివారం ఉదయం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న శివకుమార్ చిత్రోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు సొసైటీ చైర్మన్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. శివకుమార్ మాట్లాడుతూ ఎందరో జాతీయ, అంతర్జాతీయ కళాకారుల పుట్టినిల్లు తెనాలని, కళల కాణాచిగా దేశవ్యాప్తంగా పేరొందిన తెనాలిలో అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాన్ని ఏర్పాటు చేసిన నిర్వహకులు అభినందనీయులన్నారు. గత 35 సంవత్సరాలుగా ఫిల్మ్ సొసైటీ నిర్వహణలో ప్రతిపటా చిత్రోత్సవాలను జరపడం పార్శనీయం అన్నారు. ఇప్పటి వరకూ తెనాలలో మూడు సార్లు అంతర్జాతీయ చిత్రోత్సవాలను నిర్వహించి చలన చిత్ర రంగంలో తెనాలికి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా శ్రమించిందన్నారు. బాలల మనో వికాసానికి బాలల దినోత్సవం సందర్భంగా చిత్రోత్సవం నిర్వహించి తెనాలి కళాఖ్యాతిని ఇముడింపజేశారన్నారు. ఉత్తమ విలువలతో కూడిన చిత్రాలను ప్రేక్షికులు ప్రోత్సహించాలన్నారు. వివిధ ప్రాంతాల, దేశాల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధునిక విజ్ఞానం అంతర్జాతీయ చిత్రాలను తిలకించడం ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. తెనాలి, పలువర, గ్రామీణ ప్రాంతాల బాలబాలికలకు చిత్రోత్సవం మంచి పదవకాశం అన్నారు. సమాజాన్ని ప్రభావితం చేసే బలమైన సాధనం సినిమా అని చెప్పారు. పురపాలక సంఘం సహకారంతో వచ్చే నెల నుంచి తొలిగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కళాక్షేత్రం వేదికగా నెలకు ఒక సారి ఉచితంగా ఉత్తమ చిత్రాలను తిలకించే అవకాశం కల్పిస్తామని హామీనిచ్చారు. తెనాలి ప్రాంత కళా వారసత్వాన్ని యువత అందిపుచ్చుకుని గర్వకారణంగా నిలవాలన్నారు. విద్యారంగాన్ని ప్రోత్సహించడంలో ముందు ఉన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ కాలేదా నసీమ్ మాట్లాడుతూ తొలి ప్రధాని నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా నిర్వహించుకుంటామని నేడు తెనాలిలో ఘనంగా నిర్వహించడం అభినందనీయం అన్నారు. నేటి పౌరుల పైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. బాల్యంలోనే ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని కృషి చేసి సాధించుకోవాలన్నారు. రాకిట్టూ బాలల చిత్రం దర్శకులు నాగ మురళి మాట్లాడుతూ తెనాలి కళాకారులు తన చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారన్నారు. అద్భుతమైన కళాకారుల జన్మస్థలి తెనాలి అని అన్నారు. చిత్రోత్సవంలో రాకిట్టూ చిత్రం ప్రదర్శించడం సంతోషకరమన్నారు. రాష్ట్ర గౌడ కార్పోరేషన్ చైర్మన్ మధూర్ శివరామ కృష్ణ మాట్లాడుతూ తెనాలి రంగానికి విశేష గుర్తింపు తెచ్చిందన్నారు. అంతర్జాతీయ చిత్ర ప్రదర్శనలు నిర్వహించడం అభినందననీయదున్నారు. సొసైటీ కార్యదర్శి బొల్లిముంత కృష్ణ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి కోవిడ్ కారణంగా ఉత్సవాలు నిర్వహించలేదని ఇకపై తప్పకుండా ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. అధ్యక్షత వహించిన వీర నారాయణ మాట్లాడుతూ కార్పోరేట్ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు అనేక సౌకర్యాలు ఉంటాయని వారికి ధీటుగా సొసైటీ ద్వారా విజ్ఞానం, వినోదం పంచేందుకు చిత్రోత్సవాలను ఏర్పాటు చేసారున్నారు. తెనాలి పట్టణంలోనే కాకుండా డివిజన్, జిల్లా స్థాయిలో కూడా బాలల చిత్రాల ప్రదర్శనలను నిర్వహిస్తామన్నారు. అతిధులను ఎమ్మెల్యే, చైర్మన్ చేతుల మీదగా సత్కరించారు, జ్ఞాపికలను అందజేశారు. తొలుత ఎమ్మెల్యే శివకుమార్, కాలేదా నసీమ  విద్యార్థులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసారు, నెహ్రు  చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిత్రోత్సవ ప్రత్యేక టీజర్, యానిమేషన్ టీజర్ లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. లోగో రూపొందించిన దర్శకుడు 
కనపర్తి రత్నాకర్ ను అభినందించారు. మునిసిపల్ పాఠశాలల విద్యార్థినులు  ఉపాధ్యాయుడు బెల్లంకొండ వెంకట్ పర్యవేక్షణలో ప్రదర్శించిన జానపద నృత్యాలు అలరించాయి. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన బాలీవుడ్ చైల్డ్ స్టార్, పదేళ్ల వయసులోనే ముపై చిత్రాల్లో, టివి, వెబ్ సిరీస్ లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎ. భాను ప్రకాష్ పలు చిత్రాల్లోని హిట్ డైలాగ్ చెప్పి మెప్పించాడు. అద్భుతమైన సృత్యాలు చేసి ఔరా అనిపించాడు. చిత్రోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సొసైటీ ఉపాధ్యక్షులు రామరాజు, మురళి, సొసైటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తొలి రోజు ఏ సాంగ్ సారో, 
 హిజ్ న్యూ జాబ్, దడి, దారి, రాకిట్టూ చిత్రాలను , వీటితో పాటు దేశభక్తి ప్రధానంగా సాగిన వీరస్థలి తెనాలి మినీ మూవీ ని ప్రదర్శించారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...