విజ్ఞాన్ ఫార్మసీ కళాశాలకు ప్రతిష్టాత్మక ఎన్‌బీఏ అక్రిడిటేషన్ చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ ఫార్మసీ కళాశాలలోని బీఫార్మసీ ప్రోగ్రామ్‌కు ప్రతిష్టాత్మక ఎన్‌బీఏ( నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్) టైర్2 అక్రిడిటేషన్ సాధించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీ.శ్రీనివాసబాబు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ న్యూఢిల్లీ కేంద్రంగా ఏఐసీటీఈ అనుబంధంతో ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌కు సంబంధించిన తనీఖీ బృందం విజ్ఞాన్ ఫార్మసీ కళాశాలలో 2021 సంవత్సరం నవంబర్ 27 నుంచి రెండు రోజుల పాటు పర్యటించిందన్నారు. తనీఖీ బృందం విజ్ఞాన్ ఫార్మసీ కళాశాలలో విద్యార్థులకు అందించే విద్యా విధానం, సిలబస్ కంటెంట్, టీచింగ్ మెథడాలజీ, అకాడమిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్టులు, పబ్లికేషన్స్, ప్లేస్‌మెంట్స్, ఇంటర్న్‌షిప్స్, స్పోర్ట్స్, హాస్టల్ వసతి, విద్యార్థుల అచీవ్‌మెంట్స్, అత్యాధునిక ల్యాబ్ ఎక్విప్‌మెంట్‌లన్నింటిని రెండు రోజులపాటు విస్తృతంగా పరిశీలించిందన్నారు. విదేశాలలో ఉన్నత చదువులు చదువుకోవాలనే విద్యార్థులు ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ను సాధించిన విజ్ఞాన్ ఫార్మసీ ...