16 నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌

16 నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌



చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 18వ తారీఖు వరకు ( 3 రోజుల పాటు)  అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన బ్రౌచర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ మాట్లాడుతూ ‘‘ ఐఈఈఈ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఐవోటీ ఫర్‌ రూరల్‌ హెల్త్‌కేర్‌ ( సీఐఆర్‌హెచ్‌–2021)’’ అనే అంశంపై 3 రోజుల పాటు అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఎస్‌ఈఎస్‌ఈఐ డైరక్టర్‌ దినేష్‌ చాంద్‌ శర్మ, షార్‌ మాజీ డైరక్టర్, విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్, షైబ్‌పూర్‌ ఐఐఈఎస్‌టీ డైరక్టర్‌ డాక్టర్‌ పీ.చక్రబర్తి, ఆసియా– పసిఫిక్‌ 10వ ఐఈఈఈ రీజియన్‌ డైరక్టర్‌ ఈఆర్‌.దీపక్‌ మథూర్, యూఎస్‌ఏలోని యూసీ మాజీ డైరక్టర్, ప్రొఫెసర్‌ సారహ్‌ కుర్ట్‌›్జ, ఎన్‌ఐటీ కురుక్షేత్ర ప్రొఫెసర్‌ బ్రహ్మజిత్‌ సింగ్, ఇజ్రాయిల్‌లోని బెన్‌ గురియన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆఫర్‌ హదర్, జపాన్‌లోని టొయోటా సెంట్రల్‌ ఆర్‌ అండ్‌ డీ సీనియర్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ కెన్సుకే టకేచ్, మలేసియాలోని పహంగ్‌ యూనివర్సిటీ ఇండస్ట్రియల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జోస్‌ రంజాన్, సిలికాన్‌ ల్యాబ్స్‌ ఇంజినీరింగ్‌ సీనియర్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.వెంకటేష్, టీసీఎస్‌ సీనియర్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సంజయ్‌ కింబాహునే, హైటెక్‌ యూనిట్‌ గ్రోత్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌ ఇన్నోవేషన్‌ లీడర్‌ డాక్టర్‌ బాల ప్రసాద్‌ పెద్దిగరి, యూఏఈలోని ఐడీఎమ్‌లోని ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ సందిప్‌ రాయ్, ఐర్లాండ్‌లోని యూనివర్సిటీ కాలేజ్‌ కార్క్‌ ప్రొఫెసర్‌ సురభి సరస్వత్, ఐఐటీ వారణాసిలోని డాక్టర్‌ సంతాను దాస్, ఐఈఈఈ హైదరాబాద్, గుంటూరులలోని సబ్‌సెక్షన్‌ అఫిసియల్స్‌ కూడా హాజరవుతారని పేర్కొన్నారు.