విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా ‘ఉద్భవ్‌–2కే21’

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా ‘ఉద్భవ్‌–2కే21’





చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్‌ మీట్‌ ‘ఉద్భవ్‌–2కే21’ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కైజెన్‌( కీ టు ఆంబీషియస్‌ అండ్‌ ఇంటెలెక్చుయల్‌ జోన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ నోవల్టీ), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరులోని ఐటీసీ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ మధు వింజమూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మధు వింజమూరి  మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధితోనే జీవితంలో మంచి ఉపాధిని, ఉన్నత స్థానాలను పొందగలరని, కేవలం మార్కులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా విషయపరిజ్ఞానం చాలా అవసరమని అన్నారు. కొత్త ప్రదేశం, కొత్త వ్యక్తులపై సహజంగా ఉండే భయాన్ని పోగొట్టి,  విద్యార్థులకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఇనుమడింపచేసేందుకు ఇటువంటి స్నేహపూరితమైన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలున్నాయని, పోటీ ఎంత ఉన్నా కానీ స్మార్ట్‌ వర్క్‌ ఉంటే ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించగలరని అన్నారు. మేనేజర్‌గా రాణించడానికి ఎంబీఏ విద్యార్థులకు ప్రెజెంటేషన్‌ స్కిల్స్‌ అవసరమన్నారు. ‘ఉద్భవ్‌–2కే21’లో భాగంగా యువ ప్రభందక్, బిజినెస్‌ గ్రిల్, హెచ్‌ఆర్‌ ఆజా. రూరల్‌ లే కార్టే, స్టాక్‌ విజార్డ్, మార్కెట్‌ క్షేత్ర, కార్పొరేట్‌ రోడీస్, క్విజ్‌ గాలా, రాక్‌ ఎన్‌ రోల్‌ డాన్స్, మై పోస్, చెరీస్‌ ద చేస్, , క్రియోటివ్‌ కార్నర్‌ వంటి కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతి«థులను ఘనంగా సన్మానించారు. ‘ఉద్భవ్‌–2కే21’లో భాగంగా నిర్వహించిన పలు పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను, మెమోంటోలను అందజేసారు.