సేవా భారతి పురస్కారం అందుకున్న యువనటుడు మధుకర్

సేవా భారతి పురస్కారం అందుకున్న యువనటుడు మధుకర్
 మానవ హక్కుల సంఘం చైర్మన్ సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న మధుకర్
తెనాలి: 
పట్టణానికి చెందిన యువనటుడు, న్యాయవాది కనపర్తి మధుకర్ సేవా భారతి పురస్కారాన్ని అందుకున్నారు. నటన విభాగం లో ఉత్తమ నటునిగా మధుకర్ ను గుర్తించి ఈ పురస్కారాన్ని  ప్రపంచ మానవ హక్కుల సంఘం ప్రధానం చేసింది. శుక్ర వారం నెల్లూరులో జరిగిన ప్రపంచ మానవ హక్కు దినోత్సవం వేడుకల్లో  భాగం గా జరిగిన ప్రదానోత్సవం లో  పలు రం గాల్లో ఉత్తమ సేవలు అందించిన వారిని ఎంపిక చేసి అవార్డులను సంస్థ డైరెక్టర్ సుబ్బారెడ్డి,  సభ్యులు అందించారు.
వృత్తి రీత్యా అడ్వకేట్ అయిన మధుకర్ కళా రంగపై ఉన్న ఇష్టంతో నాటకాలు, సినిమాలలో నటించాడు. రంగస్థల కళ ద్వారా పలు ఉత్తమ నాటకాల్లో నటించి ప్రజలను చైతన్యవంతం చేశారు. నాటకాల్లో నటించడం తో పాటు టీవీ, సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ సందర్భంగా మధుకర్ ను కళారంగ ప్రముఖులు, కళా సంస్థల నిర్వాహకులు, 
పట్టణ ప్రమఖులు, కళాభిమాలు అభినందించారు.