ఫెడరేషన్ నేతలు రఘురామయ్య,రవీంద్ర లకు సత్కారం

ఫెడరేషన్ నేతలు రఘురామయ్య,రవీంద్ర లకు  సత్కారం
------------------------------



తెనాలి డిసెంబరు 10: అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం చెంచుపేటలో ఇండియన్ పీస్  కార్యాలయం లోబిషప్ ప్రవీణ్ వర్మ ఆధ్వర్యంలోశుక్రవారం సమాజంలో విశిష్ట సేవలందించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు టి.రవీధ్రబాబు,గౌరవ అధ్యక్షులు కె.రఘురామయ్య లను సత్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అడిషనల్ యస్.పి.థియోఫిలస్,
రిటైర్డ్ టీచర్ చిలకా జాన్ ప్రసాద్, పినపాటి సురేష్, సునీల్ లు మాట్లాడుతూ  అంబేద్కర్ రూపొందించిన చట్టాలు కచ్చితంగా అమలుచేసి బలహీనులకు రక్షణ కల్పించాలని కోరారు.  ఎ.పి.ఎస్సీ కమీషన్ మెంబర్ బసవరాజు మాట్లాడుతూ ఒకవ్యక్తి స్వేచ్చను హరించటం ,భంగం కలిగించటం చేయ కూడదన్నారు.ప్రజలమధ్య ఐక్యత పాటించాలన్నారు.పౌరులు అహం, గర్వానికి దూరంగా ఉండాలన్నారు. నీలిమ అజయ్ మాట్లాడుతూ హక్కులు తెలుసుకుని వాటిని సాధించుకోవటం ద్వారా బలపడతామన్నారు.హిందు పత్రిక ప్రతినిధి శామ్యూల్ జనార్ధన్, ఫెడరేషన్ సభ్యులు ప్రకాశరావు, పి. పున్నయ్య, జీ. ప్రేమ్ కుమార్, శ్యామ్యుల్, జహీర్, శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, శ్రీ శ్రీ మీడియా శ్రీకాంత్, రవి కిరణ్, పలువురు పాత్రికేయులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. పాత్రికేయులుగా సమాజం లోని పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించడం లో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న పాత్రికేయులు రవీంద్ర బాబు, రఘు రామయ్యలను అభినందించారు. సత్కార గ్రహీతలు మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యవంతం చేయడం లో పాత్రికేయుల పాత్ర ప్రముఖమైనదన్నారు.