సృజన ప్రతిభా పురస్కారం అందుకున్న రచయిత్రి కోడె యామిని

సృజన ప్రతిభా పురస్కారం అందుకున్న రచయిత్రి కోడె యామిని 

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ప్రముఖ రచయిత్రి కోడె యామిని దేవి నెల్లూరుకు చెందిన సాహిత్య, సాంస్కృతిక వేదిక సంస్థ సృజన ప్రతిభా పురస్కారం అందుకున్నారు. నెల్లూరులోని మురళీకృష్ణ హాస్పటల్ ప్రాగణంలో ఆదివారం జరిగిన ఘంటసాల జయంతి వేడుక సభలో యామిని దేవి సంస్థ నిర్వహకులు ఈ పురస్కారాన్ని అందజేసారు. సంస్థ అధ్యక్షులు దగ్గుపాటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన సృజన సంస్థ తరపున ఘనంగా సత్కరించారు. యామినిదేవితో పాటు శాస్త్రీయ నృత్య గురువు వి. సంధ్యా శేఖర్, సినీ సంగీత పోటీల్లో సీనియర్ విభాగంలో పాల్గొని విజేతలుగా నిలిచిన శ్రీనివాసమూర్తి, యం. చక్రపాణి, యన్. వి సుబ్బయ్యలను సత్కరించారు. జూనియర్ విభాగంలో విజేతలు లోహిత్ రెడ్డి, వైష్ణవి, శరణ్యలకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించారు. కార్యక్రమంలో ప్రపంచ తెలుగు సమాఖ్య నెల్లూరు ప్రాంత అధ్యక్షులు నలుబోలు బలరామయ్య నాయుడు, 
డాడీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ కె. ఆనందరావు, సీనియర్ గాయకులు, న్యాయవాది మరుధూరి రామకృష్ణ, టి.వి రత్నం, మనం ఫౌండేషన్ చైర్మన్ పనం శ్రీరాములు, డాక్టర్ కె. శ్రీరామ్ కుమార్లు పాల్గొన్నారు. పాటల పోటీలకు న్యాయనిర్ణేతలుగా వి. హర్షవర్ధిని, హరితలు వ్యవహరించారు.