సమాజానికి తిరిగి ఇవ్వాలి

సమాజానికి తిరిగి ఇవ్వాలి

అమెరికాలోని తానా ప్రెసిడెంట్‌ లావు అంజయ్య చౌదరి



విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగే క్రమంలో సేవ చేస్తూ వీలైనంత వరకు సమాజానికి తిరిగి ఇవ్వాలని అమెరికాలోని తానా( తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా) ప్రెసిడెంట్‌ లావు అంజయ్య చౌదరి పిలుపునిచ్చారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ‘‘ ప్రాస్పెక్ట్స్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌– ఎంప్లాయిమెంట్‌ ఇన్‌ అమెరికా’’ అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమెరికాలోని తానా ప్రెసిడెంట్‌ లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు 3డీ ( డిసిప్లేన్, డిటర్మినేషన్, డెడికేషన్‌) ఫార్ములాను అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులందరూ మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలని, కుటుంబ బంధాలను గౌరవిస్తూ నైతిక విలువలను పాటించాలని, సమాజానికి సేవ చేయాలని తెలియజేసారు. అనంతరం విద్యార్థులు యూఎస్‌కి వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన సెక్యూరిటీ టిప్స్‌ను వెల్లడించారు. విద్యార్థులు ఐ–20 డాక్యుమెంట్‌ను తప్పనిసరిగా పూర్తిచేయాలన్నారు. విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ 2021–23వ సంత్సరానికి అమెరికాలోని తానా ప్రెసిడెంట్‌గా లావు అంజయ్య చౌదరి ఎన్నికవడం చాలా సంతోషంగా ఉందన్నారు.