Skip to main content

వినరా భారత వీరకుమారా విజయగాథ నేడు

బుర్రకథా కళాకారుడు : షేక్ నాజర్
వినరా భారత వీరకుమారా విజయగాథ నేడు, తందాన తాన.
బుర్రకథ అనే మాట వినగానే మన కందరికీ గుర్తువచ్చే మొదటి పేరు షేక్ నాజర్. ఆంగ్లేయుల పాలనాకాలంలో, గుంటూరుజిల్లా పొన్నేకల్లు గ్రామంలో ఒక నిరుపేద ముస్లిం కుటుంబములో షేక్ నాజర్ జన్మించేరు. షేక్ నాజర్ తండ్రిగారు తన కుటుంబములో నెలకొనియున్న దుర్భర ఆర్థిక పరిస్థితులను సహితము లెక్కచేయకుండా, తన పుత్రుడు మున్ముందు గొప్ప పేరుప్రఖ్యాతులు గడించాలనే గంపెడు ఆశతో షేక్ నాజర్‍ను పొన్నేకల్లులోని ప్రాథమిక పాఠశాలకు పంపించేరు. తనకుగల చిన్న పొలమునుండి వచ్చే అతితక్కువ రాబడికి తోడుగా సన్నాయి వాయిద్యముద్వారా సంపాదించినదానిలో అధిక మొత్తాన్ని కొడుకు చదువుకే వెచ్చించేవారు.
ఆ పాఠశాలకు వచ్చిన ఒక స్కూల్‍ఇన్పెక్టర్ నాజర్‍లోని కళని గుర్తించి కొన్ని నాటకాలలో నటించే అవకాశం కల్పించేరు. ఆ నాటకాలలో హార్మోనియం వాయించే ఒక కళాకారుడు నాజర్‍ని బాలరత్న సభ అనే నాట్యమండలిలో చేర్చడంతో నాజర్‍కు రంగస్థల కళాకారుడు అవడానికి వీలు చిక్కింది. తొలుతగా నాజర్ అంత పిన్న వయసులోనే సంత్ కబీర్ దాస్ పాత్రను అద్భుతంగా పోషించేడు. ఆ నాట్య మండలి నెలకు ఇచ్చే పదిహేను రూపాయల పారితోషికము ఏమాత్రము చాలకున్ననూ, నాజర్ కర్నాటక సంగీతాన్ని నేర్చుకోవడం మానలేదు. కానీ అదికూడా ఎంతోకాలం సాగలేదు; బాలరత్న సభ మూతపడడంతో ఇంటిదారి పట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. కాని నాజర్ తండ్రి నెలనెలా మూడురూపాయలు చెల్లిస్తూ వేరే సంగీతవిద్వాసునిదగ్గర విద్య కొనసాగింపజేసేరు. కొంతకాలానికి కుటుంబ పరిస్థితులు మరింత క్షీణించడంతో ఆ మూడురూపాయలు చెల్లించే స్థితికూడా లేకపోయింది. శుద్ధశ్రోత్రీయ బ్రాహ్మణుడైన ఆ సంగీతం ఉపాధ్యాయుడు నాజర్‍ను తన ఇంటివద్దనే ఉంచుకొని, తన ఇంట్లోనే భోజన సదుపాయాలను కల్పించి, నాజర్ సంగీత విద్యాభ్యాసాం కొనసాగేలా ఏర్పాటు చేసేరు. కానీ కళాకారుల జీవితాలు కన్నీటిగాథలే కదా!, తండ్రి హటాన్మరణంతో నాజర్ మళ్ళీ ఇంటిముఖం చూడవలసివచ్చింది. కుటుంబపోషణాభారాన్ని తనపై వేసుకొన్న నాజర్ మాతృమూర్తి పతి అడుగుజాడలలోనే నడచి, పుత్రుని సంగీత విద్యాభిలాషను నెరవేర్చడానికి నాజర్‍ను అక్కడకు దగ్గరలోనేఉన్న తాటికొండ గ్రామములో ఒక సంగీత విద్వాంసునివద్దకు పంపినది. ఆ ఊళ్ళో నాజర్ వారాల‍అబ్బాయిగా ఉంటూ విద్య కొనసాగించేడు. 
ఇంటిదగ్గర తల్లిపడుతున్న కష్టాన్ని చూడలేకపోయిన నాజర్ విద్యకు స్వస్తిచెప్పి, ఉన్న పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబభారాన్ని లాగడం మొదలుపెట్టాడు. దర్జీగా పనిచేస్తూకూడా కొంత సంపాదించసాగేడు. వివాహమైన తరువాత అత్తారిఊళ్ళో కొంతమందికి సంగీతం నేర్పుతూ సంపాదనని మెఱుగు పఱచుకొన్నాడు.  కమ్యూనిస్టు భావజాలానిని గట్టిగా నమ్మిన   నాజర్ ఆ పార్టీలోచేరి, దాని వ్యాప్తికి తన కళాకౌశలాన్ని బాగా ఉపయోగించేడు. కానీ ఆ పార్టిమీద అప్పట్లో నిషేధం ఉండడంవల్ల అంత చుఱుకుగా ఉండలేకపోయాడు. నిషేధం తొలగిపోయిన తరువాత ప్రజానాట్యమండలి అనే సంస్థతో ఎన్నో బుర్రకఠలను చెప్పనారంభించేడు; అది దాదాపు 1941లో. ఆ బుర్రకథలలో తన స్వంతగాథనే చెప్పుకొంటున్నట్లు భావించేవాడు.
అంతవరకూ నాజర్ ఇతరులు వ్రాసిన కథలను ప్రదర్శిస్తుండేవాడు. నాజర్‍లో నిక్షిప్తమైయున్న నటనాకౌశలాన్ని, గానసంపదను గమనించిన ప్రయాగ కోదండరామశాస్త్రిగారు నాజర్‍ని స్వంతరచనలకు పూనుకొమ్మని ప్రోత్సహించేరు. దాంతో నాజర్‍లోని సాహిత్యకారుడు మేల్కొని పల్నాటియుద్ధం, బొబ్బిలియుద్ధం, కళింగయుద్ధం మొదలగు ఎన్నో బుర్రకథలను రచించి కళామతల్లికి అంకితం ఇచ్చేరు. వాడవాడల నాజర్‍దళాలు ఏర్పడి బుర్రకథలకు క్రొత్త ఒరవడిని తెచ్చాయి. స్వాతంత్ర్యముతరువాత బుర్రకథలలో కొన్ని మార్పులు సహజంగానే చోటుచేసు కొన్నాయి. బుర్రకథలను రాజకీయపక్షాల ప్రచారానికి, ప్రభుత్వపథకాల ప్రాచుర్యానికి వాడుకోవడం మొదలయ్యింది. తరువాత ఎన్నో కళలలాగే ఆదరణను కోల్పోయింది. తెలుగు-ఫ్రెంచ్, ఫ్రెంచ్-తెలుగు నిఘంటువును సంకలపఱచడానికి భారతదేశము వచ్చిన ఫ్రాన్స్ దేశస్థుడు డేనియల్ నెగెర్ తెలుగుసీమలో కలయతిరిగి నాజర్‍గారి బుర్రకథల నెన్నింటినో సంగ్రహించేరు.   
కళింగరాజ్యం కంటబడ్డది, పదాదిసైన్యం వెంటబడ్డది
కత్తులుదూశారూ రక్తపుమడుగుల తేలారూ...
(-కళింగయుద్ధం బుర్రకథనుండి)

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...