మానవాళి జీవితంలో వెలుగు నింపడానికి ఏసుక్రీస్తు అవతరించాడు

మానవాళి జీవితంలో వెలుగు నింపడానికి ఏసుక్రీస్తు గా ఈ ప్రపంచంలో అవతరించాడని


జడ్పిటిసి పిల్లి ఉమా ప్రణతి , ఎంపీపీ చెన్ను బోయిన శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెనాలి శివారు మల్లెపాడు  రక్షణ కర్త ప్రార్థనా మందిరం లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి కనపర్తి అబ్రహం లింకన్ అధ్యక్షత వహించారు నాయకులు తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం మానవాళి రక్షణ కోసం ఏసుక్రీస్తు భూలోకంలో జన్మించారని, ఆయన మానవాళికి చూపిన మార్గం ఆచరణీయమని అన్నారు. రాజులను ఆశీర్వదించాలని బైబిల్ లో చెప్పారని, అయితే నేడు రాజులు అనేవారు పాలకులు అని వారిని ఆశీర్వదించాలని ప్రార్థనలో దేవుడిని కోరాలి  అన్నారు. ఆయన జన్మదినం ప్రపంచానికి మహాద్భుత క్రిస్మస్ రోజు అని చెప్పారు. ప్రజలకు ఏవైనా సమస్యలు వస్తే తమ వంతు గా సహకరిస్తామని తెలియజేశారు .ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు సేవ చేస్తున్నారని పేర్కొన్నారు . 2022 నుండి పెన్షన్ను 2వేల500 వందలకు పెంచుతున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా నాయకులు క్రిస్మస్ కేక్ ను కట్ చేసి ,స్టార్ ను ఆవిష్కరించారు. క్రిస్మస్ సందేశాన్ని రెవరెండ్ కారుమంచి కిషోర్ బాబు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మన ప్రభాకర్, పార్టీ అధికార ప్రతినిధి గొరికిపూడి బాలరాజు, పట్టణ పార్టీ అధికార ప్రతినిధి అక్కి దాస్ కిరణ్ కుమార్, కౌన్సిలర్లు దుబాయ్ బాబు , యాతాటి అనిల్, వైసిపి నాయకులు పినపాటి నిరంజన్, పినపాటి అనిల్, పరుసు రాజ్ కుమార్ , టిడిపి నాయకుడు పినపాటి రవీంద్రబాబు, పాల్గొన్నారు కార్యక్రమాన్ని రక్షణ కర్త ప్రార్థనా మందిరం పాస్టర్ చిలువూరి ఎలిషా పర్యవేక్షించారు.