రాజ్యాంగ విలువలను కాపాడాలి

రాజ్యాంగ విలువలను కాపాడాలి

  భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు 

భారత రాజ్యాంగ విలువలను కాపాడటం నేటి తరం విద్యార్థులు బాధ్యతని భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లా డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో లా విద్యార్థులకు ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు విద్యార్థులకు ప్రాథమిక హక్కుల గురించి అవగాహన కల్పించాడు. గోప్యత హక్కు, తప్పనిసరి టీకా విధానాలు మరియు దాని రాజ్యాంగబద్ధత మొదలైన ప్రాథమిక హక్కులకు సంబంధించిన వివిధ సందర్భాలు మరియు సమస్యలను విద్యార్థులకు ప్రస్తావించాడు. అకాడమీ గోప్యత, న్యాయవ్యవస్థ స్వతంత్రత, న్యాయవ్యవస్థ, కేసుల పెండింగ్‌లు, మధ్యవర్తిత్వం మొదలైన అంశాలపై విద్యార్థులకున్న సందేహాలను జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నివృత్తి చేశారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లా – సివిల్‌ సర్వీసెస్‌ విద్యార్థులు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.