రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జిల్లాల్లో సదస్సులు

రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జిల్లాల్లో సదస్సులు 

- ఎపిడబ్యుజెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు పిలుపు 
జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర సమాచార కమిషనర్ కు వినతిపత్రం అందజేత 


టాలెంట్ ఎక్స్ ప్రెస్ విజయవాడ : రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపిడబ్యుఈఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం విజయవాడ ఎంజి రోడ్డులోని రాకూర్ గ్రంథాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఎస్. వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆంజనేయులు మాట్లాడుతూ వచ్చే జనవరిలో జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే అక్రడిటేషన్లు, రైల్వేపాస్ లు, హెల్త్ కార్డుల సమస్యలపై కూడా ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని కోరారు. జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసే అన్ని కమిటీల్లో జర్నలిస్టులను యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఒ. శాంతిశ్రీ, ఎ. అమరయ్యతోపాటు అన్ని జిల్లాలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కనపర్తి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.