డాక్టర్ పిల్లి వాసు కు నన్నయ విద్యాపీఠం వారి విశిష్ట ప్రతిభా పురస్కారం



డాక్టర్ పిల్లి వాసు కు నన్నయ విద్యాపీఠం వారి విశిష్ట ప్రతిభా పురస్కారం 


స్థానిక తెనాలి ఐతానగర్ కు చెందిన డా॥ పిల్లి వాసు కు నన్నయ విద్యాపీఠం వారి విశిష్ట ప్రతిభా పురస్కారం లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డి.యన్, ఆర్ కళాశాల ఏ.జి కోర్సెస్ తెలుగుశాఖ మరియు నన్నయ విద్యాపీఠం వారు సంయుక్తంగా ఈ నెల 11 వ తేదీన నిర్వహించిన సభా కార్యక్రమంలో ఈ పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా భీమవరం డి.యన్. ఆర్ కళాశాలలోని ఆచార్య కలిదిండి సీతారామరాజు గారి స్మారక సమావేశ మందిరమైన సెమినార్ హాల్ లో, అనేక పుస్తకావిష్కరణల మధ్య జరిగిన మైత్రి సదస్సు కార్యక్రమంలో వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ఆచార్యుల మేడిపల్లి రవికుమార్, ఆచార్య రేమిళ్ళ బెంకట కృష్ణశాస్త్రి, ఆచార్య యార్లగడ్డ రామకృష్ణ, మరియు దా॥ యండపల్లి పాండురంగ ప్రాధార్యులు ,పండితులు మరియు భాషాభిమానులందరి సమక్షంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ద్వారా వెలువరించిన ఉత్తమ పరిశోధనలకు గాను, డా|| పిల్లి వాసు ను ఈ విశిష్ట ప్రతిభా పురస్కారంతో సత్కరించారు. 
డాక్టర్. పిల్లి వాసు గతంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ జాతీయ సేవా పురస్కారాన్ని, మరియు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాన్ని పొందటంతో పాటు తాను చేసిన పరిశోధనకు గాను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ బంగారు పథకాన్ని బహుకరించింది. అంతేగాక కేంద్ర ప్రభుత్వం యొక్క విశ్వవిద్యాలయాల విరాళాల సంఘం యు.జి.సి, వారిచే జాతీయ పురస్కారాన్ని రెండుసార్లు పొందటం ఎంతో విశేషం.
పిల్లి వాసు అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని భాషా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక రంగాలకు చెందిన నూతన సిద్ధాంత భావాలతో కూడిన 58 పరిశోధనా పత్రాలను సమర్పించటం గొప్ప విషయమని, అటువంటి పరిశోధకునికి నేడు ఎంతో ప్రతిష్టాత్మకమైన నన్నయ విద్యా పీఠం వారి విశిష్ట ప్రతిభా పురస్కారం లభించటం విశేషమని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు గుజ్జర్లమూడి కృపాచారి, మరియు విశ్వవిద్యాలయ రెక్టార్ మరియు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి. వర ప్రసాదమూర్తి, తెలుగు శాఖ ఆచార్యులు, పలువురు విద్యావేత్తలు, నాయకులు, డాక్టర్. పిల్లి వాసుకు అభినందనలు తెలియజేశారు.