క్రీడలు మానసిక, శారీరక దృడత్వానికి దోహదపడతాయ - తెనాలి డీఎస్పీ స్రవంతి రాయ్ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ ,తెనాలి: క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని తెనాలి డీఎస్పీ డాక్టర్ స్రవంతీ రాయ్ పేర్కొన్నారు. పోలీసు శాఖ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా స్టోర్ట్ మీట్ నిర్వహించగా క్రీడల్లో తెనాలి డివిజన్ తరపున పాల్గొని పలు బహుమతులు అందుకున్నారు. ఈ స్పోర్ట్ మీట్లో తెనాలి సబ్ డివిజన్ కు ఓవరాల్ చాంపియన్ షిప్ లో రెండో స్థానం దక్కించుకున్నారు. వాలీబాల్, షటిల్ తదితర క్రీడల్లో విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా తెనాలి డిఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో డీఎస్పీ ఆధ్వర్యంలో విజేతలకు అభినందన సభ నిర్వహించారు. సభలో డీఎస్పీ మాట్లాడుతూ క్రీడలు ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. మానసిక వత్తిడులు క్రీడల ద్వారా తగ్గించుకోవచ్చునన్నారు. విజేతలను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ నాయకులు టి. రవీంద్రబాబు, కె. రత్నాకర్, ఎ. శ్యామ్ సాగర్, పి.పున్నయ్య, ఎ. సాంబశివరావు, డి. కోటేశ్వరరావు, జి. ప్రభాకర్, ఎస్.ఎస్ జహీర్, ప్రేమ్ కుమార్, ఎం. సుట్టారావు, జి. ప్రకాశరావు...