ఈ నెల 20న ‘‘విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌’’ లాంచింగ్‌ ప్రోగ్రామ్‌

ఈ నెల 20న ‘‘విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌’’ లాంచింగ్‌ ప్రోగ్రామ్‌

ఏపీ విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ చేతుల మీద ప్రారంభం


చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఈ నెల 20న ’’విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌’’ లాంచింగ్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 20న జరిగే విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ లాంచింగ్‌ ప్రోగ్రామ్‌కు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ, హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్, గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్, ప్రొఫెసర్‌ కే.హేమచంద్రారెడ్డి, విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల వైస్‌ చైర్మన్, నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొంటారని తెలియజేసారు. ఈ లాంచింగ్‌ ప్రోగ్రామ్‌ వలన ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ విభాగంలో బీబీఏ(జనరల్‌), ఎంబీఏ (హెచ్‌ఆర్‌), ఎంబీఏ (ఫైనాన్స్‌), ఎంబీఏ(జనరల్‌) కోర్సులతో పాటు ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ విభాగంలో 4 కోర్సులైన బీబీఏ (జనరల్‌), ఎంబీఏ (ఫైనాన్స్‌), ఎంబీఏ (జనరల్‌), ఎంబీఏ (హెచ్‌ఆర్‌) కోర్సులకు సంబంధించిన క్లాసులు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.