విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వైభవంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

అనుభవాల నుంచి నేర్చుకోవాలి

  బెంగళూరులోని సహజ్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ ఆర్కిటెక్ట్‌ అండ్‌ హెచ్‌ఆర్‌  విజయ్‌ కుమార్‌

  విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వైభవంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని బెంగళూరులోని సహజ్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌æఆర్కిటెక్ట్‌ అండ్‌ హెచ్‌ఆర్‌  విజయ్‌ కుమార్‌  తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో బుధవారం భారత 73వ గణతంత్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు యుద్ధాల్లో వీర మరణం పొందిన సైనికులకు నివాళిగా ఏర్పాటు చేసిన అమర్‌ జవాన్‌ స్థూపానికి నివాళులర్పించి జ్యోతి వెలిగించారు. విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ, ఎన్‌సీసీ పరేడ్‌ ఎంతగానో ఆకర్షించింది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెంగళూరులోని సహజ్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌æఆర్కిటెక్ట్‌ అండ్‌ హెచ్‌ఆర్‌  విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ముందుకురావాలన్నారు. విద్యార్థులు జీవితంలో వారికి ఏమి కావాలి? వారికి ఏమి ఇష్టమో అది మాత్రమే చేయాలని... ఇష్టంలేని పనిచేయవద్దన్నారు. ప్రతిరోజు చివరిరోజుగా భావించాలి ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన ఉన్న విద్యార్థులే ఉన్నత స్థానాలకు ఎదగగలరని తెలియజేసారు. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో వీలైనంత ఎక్కువ మంది పరిశోధనల వైపు దృష్టిసారించాలన్నారు. అప్పుడే దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తుందన్నారు. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పీఎంవీ రావు మాట్లాడుతూ మహానీయుల త్యాగాల వల్లనే దేశ స్వాతంత్య్రం సాధ్యమైందని, యువత దేశ నాయకులను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని సూచించారు. విద్యార్థులు సామాజిక సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొన్నప్పుడే తమ దేశానికి వారు అసలైన సేవలు అందించనట్లవుతారని యువతను ఉద్దేశించి చెప్పారు.