విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయిలో స్వయం ఎన్‌పీటీఈఎల్‌ ‘‘ఏఏ’’ గ్రేడ్‌

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయిలో స్వయం ఎన్‌పీటీఈఎల్‌ ‘‘ఏఏ’’ గ్రేడ్‌

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ఐఐటీ మద్రాస్‌ విడుదల చేసిన జాతీయస్థాయి స్వయం ఎన్‌పీటీఈల్‌ ర్యాంకింగ్స్‌లో ‘‘ఏఏ గ్రేడ్‌’’ లభించిందని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వయం ఎన్‌పీటీఈఎల్‌ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జాతీయస్థాయిలో 50లోపు ర్యాంక్‌ సాధించి ‘‘ఏఏ గ్రేడ్‌’’ను సొంతం చేసుకుందన్నారు. ఎన్‌పీటీఈఎల్‌ నిర్వహించిన వివిధ రకాల కోర్సులలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు పాల్గొని 893 కోర్సు సర్టిఫికెట్లు సాధించారన్నారు. వీటిలో 19 మందికి టాపర్స్, 10 గోల్డ్, 151 సిల్వర్, 392 ఎలైట్, 304 మంది సాధారణ ఉత్తీరణత సర్టిఫికెట్స్‌ సాధించారని వెల్లడించారు. 2021వ సంవత్సరంలో ఎన్‌పీటీఈఎల్‌ నిర్వహించిన వివిధ రకాల కోర్సులలో జనవరి నుంచి డిసెంబర్‌ వరకు నిర్వహించిన కోర్సులలో ఉత్తమ ప్రతిభకు గాను విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ‘‘ఏఏ గ్రేడ్‌’’ లభించిందని వెల్లడించారు.