సమాజ చైతన్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:


సమాజ చైతన్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని
అదే సమయంలో బాధ్యతాయుతమైందని ప్రముఖ సీనియర్ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు అన్నారు. స్థానిక కొత్త పేటలోని ఏపి పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ ఆద్వర్యంలో సంక్రాంతి సంబరాలు, తెనాలి, వేమూరు నియోజకవర్గాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఫెడరేషన్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు టి.రవీంద్రబాబు, కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత జర్నలిస్టుల సంక్షేమానికి ఫెడరేషన్ చేస్తన్న కృషిని, సమస్యలపై సాధించిన వివజయాలను అధ్యక్ష, కార్యదర్శలు  వివరించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిస్టుల పై ఎంతో సామాజిక బాధ్యత ఉందన్నారు. ఫెడరేషన్ కు న్యాయసలహాదారుగా వ్యవహరించటం గర్వకారణంగా ఉందన్నారు. మైత్రి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల వైధ్యులు డాక్టర్ కృష్ణసందీప్ మాట్లాడుతూ జర్నలిస్టులకు తమవంతు సహకాకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. గోపిటివి అధినేత వి. రాజారావు మాట్లాడుతూ ప్రతి ఒక్క విలేకరి వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. 

ఎంపి జ్యూయలర్స్ అధినేత నరేష్ కుమార్ జైన్
 ఫెడరేషన్ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యదర్శి రత్నాకర్ మాట్లాడుతూ ఫెడరేషన్ కార్యక్రమాలను వెన్నంటి ప్రోత్సహిస్తున్న కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, శశి ఆహార్ అధినేత వుప్పల వరదరాజులు, హ్యాపీ హాస్పటల్ యాజమాన్యానికి, రాష్ట్ర వార్త చీఫ్ ఎడిటర్ కె.రమేష్, మునిసిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసా దకు, మహాత్మాగాంధీ సేవాశాంతి ఆశ్రమం నిర్వాహకులు వజ్రాల రామలించారికి కృతజ్ఞతలు తెలపారు. నూతన కార్యవర్గం 

ప్రమాణ స్వీకారం: 
ఏపి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి, వేమూరు నియోజక వర్గ నూతన కార్యవర్గంతో డివిజన్ కార్యదర్శి  కనపర్తి రత్నాకర్ ప్రమాణస్వీకారం చేయించారు. తెనాలి నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులుగా అంబటి శ్యామ్ సాగర్, పి.పున్నయ్య, సహాయ కార్యదర్శి బి.చందు, 
కోశాధికారిగా డికోటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ఎం.సాంబశివరావు, కార్యవర్గ సభ్యులుగా ఎస్ జె. శామ్యుల్, డి.నాగరాజు ప్రమాణ స్వీకారం చేశారు. అలానే వేమూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులుగా ఎం.సుబ్బారావు, ఎ. శేషిరెడ్డి, 
గౌరవ సలహాదారులుగా  బచ్చు సురేష్ బాబు, ఎస్ఎస్ జహీర్, యు. కోటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. నూతన కార్య వర్గాన్ని ఫెడరేషన్ సభ్యులు పి.ప్రకాశరావు, ఎం.రవికుమార్, ప్రేమ్ కుమార్, లక్ష్మణరావు, వి. భూషణం, వెంకటేశ్వరరావు తదితరు లు అభినందించారు.