క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌పై విజ్ఞాన్‌లో ప్రత్యేక సెమినార్‌

క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌పై విజ్ఞాన్‌లో ప్రత్యేక సెమినార్‌

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఐక్యూఏసీ ఆధ్వర్యంలో సోమవారం ‘‘ క్యూఎస్‌ ర్యాంకింగ్‌ అండ్‌ ఐ–గేజ్‌ అక్రిడిటేషన్‌’’ అనే అంశంపై వర్చువల్‌ విధానంలో ప్రత్యేక సెమినార్‌ కార్యక్రమాన్ని నిర్వహించామని యూనివర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. వర్చువల్‌ విధానంలో ఏర్పాటు చేసిన ఈ సెమినార్‌ కార్యకమానికి ముఖ్య అతిథిగా హాజరైన క్లైంట్‌ రిలేషన్స్‌ క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ డైరక్టర్‌ సచిన్‌ కుమార్‌ మాట్లాడుతూ క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ సాధించాలనే విద్యాసంస్థలకు అకడమిక్‌ రెపుటేషన్‌తో పాటు ఎంప్లాయర్‌ రెపుటేషన్‌ బాగా ఉండాలన్నారు. విద్యాసంస్థలో విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్లుగా అధ్యాపకులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రసిద్ధి చెందిన స్కూపస్‌ జర్నల్స్‌లో పరిశోధన పేపర్లు ప్రచురించడంతో పాటు అధ్యాపకుల సైటేషన్స్‌ ఎక్కువగా ఉండాలన్నారు. విద్యాసంస్థలో ఇంటర్నేషనల్‌ ఫ్యాకల్టీతో పాటు ఇంటర్నేషనల్‌ విద్యార్థులు కూడా సరైన నిష్పత్తిలో ఉండాలని తెలిపారు. వీటితో పాటు వీలైనంత మంది విద్యార్థులను వివిధ దేశాలకు చెందిన యూనివర్సిటీలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుని స్టూడెంట్‌ ఎక్స్‌చేంజ్‌ ప్రోగ్రామ్స్‌ను నిర్వహించాలన్నారు.