అదిరేటి సెట్లతో పుష్ప కవర్ సాంగ్ చిత్రీకరణ

అదిరేటి సెట్లతో పుష్ప కవర్ సాంగ్ చిత్రీకరణ
తెనాలి: 
పట్టణానికి చెందిన నూతన చిత్ర నిర్మాణ సంస్థ అనిల్ డిజిటల్స్ నిర్మాణ సారథ్యం లో యువ కొరియోగ్రాఫర్ కొండ్రు కిరణ్ నృత్య దర్శకత్వంలో ఇటీవల అల్ టైం ఇండస్ట్రీ హిట్ చిత్రం పుష్ప లోని ఊ అంటావా మామా ఉఊ అంటావా అనే పాటను కవర్ సాంగ్ గా ఆదివారం రాత్రి వేమూరు లోని ఓ దాభాలో చిత్రీకరించారు. ఇందులో ప్రధాన పాత్రలను ఫణి, షైనీ లు  చేస్తున్నారు. అదిరేటి సెట్ లలో, మిరుమిట్లు కొలిపే విద్యుత్ లైటింగులతో భారీ ఎత్తున ఈ కవర్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. అనిల్ డిజిటల్స్ అధినేత దేసమాల అనిల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వీరస్థలి తెనాలి దర్శకుడు కనపర్తి రత్నాకర్ ముఖ్యఅతిధిగా పాల్గొని క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. శ్రీ శ్రీ మీడియా మునిపల్లి శ్రీకాంత్ మరో అతిధిగా పాల్గొని యూనిట్ ను అభినందించారు. యువత కళారంగం లో రాణించాలని కోరారు.