Skip to main content

Posts

Showing posts from February, 2022

విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాలకు రూ.13 లక్షల ప్రాజెక్ట్‌ మంజూరు

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాలకు న్యూఢిల్లీలోని ఏఐసీటీఈ నుంచి రూ.13,39,500 లక్షల విలువైన ప్రాజెక్ట్‌ మంజూరు అయ్యిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏఐసీటీఈ– మోడరోబ్స్‌–ఏఎస్‌సీ, ‘‘మోడరైజేషన్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటిక్స్‌ ల్యాబొరేటరీ’’ పేరుతో ప్రాజెక్ట్‌ మంజూరు అయ్యిందన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు కో ఆర్డినేటర్‌గా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు, కో–కోఆర్డినేటర్‌గా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నాగం శాంతిప్రియ వ్యవహరించనున్నారని పేర్కొన్నారు. ఏఐసీటీఈ విడుదలైన ఈ ప్రాజెక్ట్‌ నిధులతో వచ్చే రెండేళ్లలో కళాశాలలో రీసెర్చ్, మౌళిక సదుపాయాల కల్పన, విద్యార్థులకు ఇంటర్న్‌షిప్స్, ల్యాబ్స్‌ ఆధునికీకరణ చేయనున్నామని వెల్లడించారు.  అధ్యాపకురాలికి బెస్ట్‌ యంగ్‌ రీసెర్చర్‌ అవార్డు యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా వాషింగ్టన్‌ డీసీలోని ప్రముఖ రీసెర్చ్‌ పబ్లిషింగ్‌ సంస్థైన రీసెర్చ్‌ నావెల్‌ అకాడమీ, గ్లోబల్‌ అక్రిడిటేషన్‌ అసెసెమెంట్‌ ఫోరమ్‌ సిరీస్‌ సంస్థ వారు తమ కళాశాల అధ్యాపకురాలు నాగం శాంతిప్రియకు బ...

విద్యార్థికి చదువే వ్యసనమవ్వాలి

విద్యార్థికి చదువే వ్యసనమవ్వాలి పంచ సహస్రావధాని డాక్టర్‌ మేడసాని మోహన్‌ విద్యార్థులకు చదువే వ్యసనమవ్వాలని పంచ సహస్రావధాని డాక్టర్‌ మేడసాని మోహన్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో అవధానంపైన ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ మేడసాని మోహన్‌ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజూ ధ్యానం చేయటం వలన ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చన్నారు. ఏకాగ్రత, ధారణశక్తిని మించిన బలం విద్యార్థులకు ఏదీ లేదన్నారు. విద్యార్థులు దురలవాట్లకు లోను కాకూడదన్నారు. గురువు అనుగ్రహం ఉన్న విద్యార్థులు ఏదైనా సాధిస్తారని కితాబిచ్చారు. చదువుకోవడం వలన కలిగే ప్రయోజనాలు, చదువుకోక పోతే జరిగే అనర్థాలను రామాయణం, మహాభారతంలోని సన్నివేశాలను వివరిస్తూ విద్యార్థులకు తెలియజేసారు. ప్రతి విద్యార్థి నిబద్ధతతో మనస్సును లగ్నం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంతో వారి అంతిమ లక్ష్యాలను చేరుకోవాలని విద్యార్థులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్, విజ్ఞాన్స్‌ జూనియర్‌ కాలేజీ సిబ్బంద...

విజ్ఞాన్స్‌ లారా విద్యార్థినికి మైక్రోసాఫ్ట్‌లో రూ.12 లక్షల వార్షిక వేతనం

విజ్ఞాన్స్‌ లారా విద్యార్థినికి మైక్రోసాఫ్ట్‌లో రూ.12 లక్షల వార్షిక వేతనం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలో నాలుగో సంవత్సరం కంప్యూటర్స్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కంచి సాయి జ్యోత్స ్నకు రూ.12 లక్షల వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగానికి ఎంపికయ్యిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో ఉండగానే మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో అసోసియేట్‌ కన్సల్టెంట్‌గా ఎంపికయ్యిందని వెల్లడించారు. ఈమెకు మైక్రోసాఫ్ట్‌ కంపెనీ 3 రౌండ్ల (రెండు టెక్నికల్, ఒకటి హెచ్‌ ఆర్‌) ఇంటర్య్వూ నిర్వహించిందని తెలిపారు. ఈమె ఇప్పటికే 6 కంపెనీల్లో (విలియమ్‌ త్రీ– రూ.7 లక్షలు, యాక్సెంచర్‌– రూ.6.5 లక్షలు, ఐబీఎమ్‌– రూ.4.5 లక్షలు, వర్చూసా– రూ.4 లక్షలు, విప్రో–రూ.3.65 లక్షలు, హెచ్‌సీఎల్‌–రూ.3.65 లక్షలు) వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగాలు సాధించిందని తెలియజేసారు. కళాశాల అధ్యాపకులు అందించిన ప్రత్యేక శిక్షణతోటి కేంబిడ్జి యూనివర్సిటీ నిర్వహించే ప్రతిష్టాత్మక పెట్‌ కోర్సును...

విజ్ఞాన్స్‌లో ఘనంగా మాతృభాషా దినోత్సవం

విజ్ఞాన్స్‌లో ఘనంగా మాతృభాషా దినోత్సవం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘బహుళ భాషా అభ్యసనానికి సాంకేతిక వినియోగం: సవాళ్లు, అవకాశాలు’’ అనే ఇతివృత్తంతో 2022 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించాలని యునెస్కో పిలుపునిచ్చిందన్నారు. విద్యార్థులకు వీలైనంతవరకు మాతృభాషలోనే విద్యాభ్యాసం జరగాలన్నారు. 2020 ఫిబ్రవరిలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్వహించిన ఓ సర్వేలో 83 వేల మంది విద్యార్థుల్లో దాదాపు 44శాతం తమ మాతృభాషలో ఇంజినీరింగ్‌ చదివేందుకు ఆసక్తి చూపుతూ ఓటు వేశారని పేర్కొన్నారు. ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో వందలాది భాషలు, వేలాది మాండలికాలకు నిలయమని, భాషా సాంస్కృతిక వైవిధ్యమే ప్రపంచంలో మన దేశానికి ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టిందని తెలియజేసారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, నగదు ...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈసీఈ విభాగానికి చెందిన నేలపాటి ఆనందరావుకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందజేసిందని ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ పర్ఫార్మెన్స్‌ ఆనాలిసిస్‌ ఆఫ్‌ కామ్‌పాక్ట్‌ వైడ్‌బ్యాండ్‌ యాంటీనా ఫర్‌ రేడియోలొకేషన్‌ అప్లికేషన్స్‌’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈయనకు నాగార్జున యూనివర్సిటీలోని ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ పీ.సిద్ధయ్య గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. శాటిలైట్‌లో వినియోగించే యాంటీనా పనితీరును మెరుగుపరుచడంలో ఈయన పరిశోధన ఉపయోగపడుతుందన్నారు. ఈయన తన పరిశోధనలో భాగంగా మొత్తం 3 స్కూపస్‌ జర్నల్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు.

విజ్ఞాన్‌లో మెగా రక్తదాన శిబిరం

విజ్ఞాన్‌లో మెగా రక్తదాన శిబిరం చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం విద్యార్థులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. వర్సిటీలోని ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం వారు గుంటూరులోని నీడ్స్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు సెకన్లకు ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరికి రక్తం అవసరం అవుతూనే ఉన్నదని తెలిపారు. విద్యార్థులు తాము రక్తదానం చేయడంతోపాటు మిత్రులను కూడా ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కోరారు. ఇంచార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పీఎంవీ రావు మాట్లాడుతూ రక్తదానం చేశాక శరీరం తాను కోల్పోయిన రక్తాన్ని 48 గంటల్లోగా తిరిగి భర్తీ చేసుకుంటుందని వెల్లడించారు. రక్తాన్ని కృత్రిమంగా తయారుచేయలేమని, ఎవరైనా దానం చేస్తేనే లభిస్తుందని వెల్లడించారు. ప్రమాదాల సమయంలో బాధితులకు రక్తం అవసరం ఎంతో ఉంటుందని చెప్పారు. రక్తదానం వల్ల నేడు ఎంతో మందిని ...

తెనాలి నూరేళ్ళు రంగస్థలి గ్రంథకర్త నేతి పరమేశ్వర శర్మ ఇకలేరు

రంగస్థల భీష్మాచార్యుడు.. తెనాలి నూరేళ్ళు రంగస్థలి గ్రంథకర్త…" నేతి పరమేశ్వర శర్మ " (Nethi Paramesh wara Sharma )  ఇకలేరు.!!  ప్రముఖ రంగస్థల,సినీ నటులు,పరిశోథకులు 'రంగస్థల భీష్మా చార్యుడు' " నేతి పరమేశ్వర శర్మ గారు"  (1928 2022,ఫిబ్రవరి 16) ప్రముఖ రంగస్థల నటులు,ఇకలేరన్న వార్త తెలుగు నాటక రంగాన్ని విషాదంలో ముంచెత్తింది. ముఖ్యంగా తెనాలి ప్రాంత నాటక రంగానికి ఆయన లేని లోటు  ఎవరూ పూరించలేనిది. ఆయన కేవలం రంగస్థల నటుడే కాదు,'స్వాతంత్ర్యం మా జన్మహక్కు' అనే సినిమాలో నల్లూరి వెంకటేశ్వరరావు, వల్లం నరసింహారావు, ముక్కురాజు, హరీష్, ఆహుతి ప్రసాద్ లతో కలిసి నటించారు.అంతేకాదు,నాటకరంగం ప్రధానమైనా,సినిమాలన్నా కూడా ఆయన కెంతో ఇష్టం.పాటిబండ్ల దక్షిణామూర్తి గారితో..కలిసిఉత్తమ చలనచిత్ర అభిమానుల సంఘం'స్థాపించారు.దానికి తొలి అధ్యక్షులు కూడా ఆయనే. *బాల్యం..!! నేతి పరమేశ్వర శర్మ 1928 లో కృష్ణా జిల్లా, దివి తాలూకా నంగేగడ్డ గ్రామంలో నిమ్మగడ్డ శ్రీరాములు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు.ఆయన అయిదు సంవత్సరాల వయసులోవున్నప్పుడు తెనాలి గ్రామానికి చెందిన నేతి కమలాంబ, సీతారామ...

జన్మదిన శుభాకాంక్షలు

విజ్ఞాన్స్‌లో ఘనంగా ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’ సోషల్‌ మీడియా లాంచ్‌

విజ్ఞాన్స్‌లో ఘనంగా ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’ సోషల్‌ మీడియా లాంచ్‌   స్వేచ్ఛా స్వాతంత్య్రాల సంరంభం :  సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ సెంట్రల్‌ మినిస్టర్‌ రామ్‌దాస్‌ బందు అత్వాలే   ప్రజలందరూ భాగం కావాలి:  రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ స్టీల్‌ ఆఫ్‌ ఇండియా సెంట్రల్‌ మినిస్టర్‌ ఫగ్గణ్‌ సింగ్‌ కులస్తే   ప్రతి ఒక్కరూ భాగమవ్వాలి :  రాష్ట్రీయ సామాజిక్‌ సమరసత సంగథన్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ రాజు సింగ్‌   16 చరిత్రాత్మక ప్రాంతాలను గుర్తించాం: రాష్ట్రీయ సామాజిక్‌ సమరసత సంగథన్‌ నేషనల్‌ జనరల్‌ సెక్రటరీ క్రిష్ణకిషోర్‌ గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఇండియాలో డెవలప్‌ చేసిన బిగ్గెస్ట్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’ను శనివారం సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ సెంట్రల్‌ మినిస్టర్‌ రామ్‌దాస్‌ బందు అత్వాలే, రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ స్టీల్‌ ఆఫ్‌ ఇండియా సెంట్రల్‌ మినిస్టర్‌ ఫగ్గణ్‌ సింగ్‌ కులస్తే ...

12న విజ్ఞాన్స్‌లో ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’ సోషల్‌ మీడియా లాంచ్‌

12న విజ్ఞాన్స్‌లో ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’ సోషల్‌ మీడియా లాంచ్‌ ముఖ్య అతిథులుగా పలువురు కేంద్ర మంత్రులు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిలో ఆజాదీ క అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 12న ఇండియాలో డెవలప్‌ చేసిన బిగ్గెస్ట్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’ను లాంచ్‌ చేస్తున్నామని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’కు సంబంధించిన పోస్టర్, బ్రౌచర్స్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పలువురు కేంద్ర మంత్రులైన రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ స్టీల్‌ ఆఫ్‌ ఇండియా మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే, రైల్వేస్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ యూనియన్‌ మినిస్టర్‌ దర్శన జర్దోష్, సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ రామ్‌దాస్‌ బందు అత్వాలే, కమ్యూనికేషన్స్‌ ఆఫ్‌ ఇండియా మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ దేవుసిన్‌ జెసింగ్‌భాయ్‌ చౌహాన్‌లు హాజరుకానున్నారని వెల్లడించారు. ఇదే కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ రా...

ప్రతి విద్యార్థిలో మానవత్వం వెల్లివిరియాలి

ప్రతి విద్యార్థిలో మానవత్వం వెల్లివిరియాలి   విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య యూనివర్సిటీలో విద్యనభ్యసించే ప్రతి విద్యార్థిలో మానవత్వం వెల్లివిరియాలని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య పేర్కొన్నారు.  ‘యంగ్‌ జనరేషన్‌ వెల్ఫేర్‌ సొసైటీ’ పేరుతో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన కొందరు విద్యార్థులు విజయవాడ, గుంటూరు, తెనాలి, రాజమండ్రి, హైదరాబాద్, చీరాల ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన 500 సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహించిన సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేక అభినందన సభను ఏర్పాటుచేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ తమ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 500 సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థి దశలోనే ఇటువంటి సేవాకార్యక్రమాలను నిర్వహించడం వలన వారిలో నైపుణ్యాలు మెరుగుపడుతాయన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా కరోనా సమయంలో అనాధలకు, రోడ్డు పక్కన నివసించే వారికి, వృద్ధులకు భోజనాలు పంచిపెట్టడంతో పాటు అవసరమైన వారికి కూరగాయలు, నిత్యా...

ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత, గానకోకిల లత మంగేష్కర్(92) ఆదివారం ఉదయం కన్నుమూశారు.

ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత, గానకోకిల లత మంగేష్కర్(92) ఆదివారం ఉదయం కన్నుమూశారు. వివాదాలకు అతీతంగా, అభిమానులకు సమీపంగా ఉండే మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. 30కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో వేల గీతాలను ఆలపించారు. అత్యధికంగా హిందీ, మరాఠీ భాషల్లో ఆమె పాటలు పాడారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ జనవరి 11న కొవిడ్‌ స్వల్ప లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె కరోనా నుంచి కోలుకొన్నట్లు వైద్యులు, కుటుంబసభ్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే శనివారం లతా మంగేష్కర్‌ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆదివారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఐదో యేటనే మొదలైన పాటల ప్రస్థానం.. ప్రముఖ థియేటర్‌ యాక్టర్‌, క్లాసికల్‌ సింగర్‌ అయిన పండిట్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌, షీవంతి దంపతులకు 1929 సెప్టెంబర్‌ 28న పుట్టిన లతామంగేష్కర్‌ జన్మించారు. తల్లిదండ్రులు తొలుత ఆమెకు హేమ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత లతగా నామకరణం చేశారు. ఆశా భోంస్లే, ఉషా మంగేష్కర్‌, హృదయనాథ్‌ మంగేష్కర్‌, మీనా కదికర్‌లు లత మంగేష్కర్‌కు తోబుట్టువులు. తండ్రి వద్దే సంగీతంలో ఓ...

ఎ.పి రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి - గాంధీ విగ్రహానికి వినతిపత్ర సమర్పణ

తెనాలి   దేశంలో, రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సరఫరా విభాగాల పంపిణీ అన్నింటిని ప్రభుత్వరంగంలోనే కొనసాగిస్తూ వాటి పురోభివృద్ధికి అవసరమైన సంపూర్ణమైన ప్రభుత్వ మద్దతు కల్పించవలసినదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల ఐకాస ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తుంది. ఎపియస్ పిఇ జె.ఏ.సి. పిలుపు మేరకు తెనాలి లో తెనాలి విద్యుత్ జెఏసి ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం ప్రదర్శన జరిగింది. ప్రదర్శనలో విద్యుత్ ఉద్యోగులు వారికి సహకారంగా ఇతర సంస్థలు, ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. పట్టణ వీధులలో ప్రెయిటికరణ వలన జరుగు నష్టాలను తెలియజేస్తూ, నినాదాలు చేస్తూ ప్రదర్శన విజయవంతంగా సాగింది. గాంధీ చౌక్ లో మహాత్మాగాంధీజి విగ్రహానికి పూలమాలలు వేసి, వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ దాసరి వెంకటేశ్వరరావు ఎపియస్ పి ఇ జెఏసి వైస్ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతికి, ప్రజా జీవన గమనానికి విద్యుత్ ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, అలాంటి విద్యుత్తును ప్రయివేటీకరించడం ధారుణం అని, వెంటనే ప్రభుత్వాలు ప్రయివేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులు ను వెంటనే  క్రమబద్ధీకర...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థినికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థినికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన చేరెడ్డి సోనాలి శ్రీదుర్గ అనే విద్యార్థినికి తమ యూనివర్సటీ   పీహెచ్‌డీ పట్టా అందించిందని ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌  తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఎక్సిపెరిమెంటల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆన్‌ సెల్ఫ్‌ హీలింగ్‌ కాంక్రీట్‌ ఇన్‌ఫ్లుయన్డ్స్‌ బై బాసిల్లస్‌ స్పెసిస్‌ ’’ అనే అంశంపై ఆమె పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈమెకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని  సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి,  ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ ఎన్‌.రూబెన్‌  గైడ్‌గా  వ్యవహరించారని పేర్కొన్నారు. ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 3 ఈఎస్‌సీఐ, 2 స్కూపస్‌ జర్నల్‌ పబ్లికేషన్, 2 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు.

విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి

విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి   - ఎ.పి రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి  - అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్ర సమర్పణ  తెనాలి: రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి కార్యాచరణ సమితి నాయకులు వినతి పత్రాన్ని గురువారం సమర్పించారు. ఉద్యోగులకు జీతాలు పెంచకపోగా పెంచామని ప్రభుత్వ ప్రచారం చేయడం సోచనీయమని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా డిస్కం జెఎసీ ఏపి సిపిడీ సిఎల్ చైర్మన్ సీ.హెచ్ పురుషోత్తమరావు మాట్లాడుతూ ఉద్యోగులతో కుదుర్చుకున్న ఒప్పందాలను ప్రభుత్వ నేటికీ అమలు చేయడం లేదన్నారు. ప్రశ్నిస్తే ఉద్యోగులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. నూతన పీఆర్సీ స్కేలుగు వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నెల్లూరు కృష్ణపట్నం ధర్మల్ పవర్ స్టేషన్ ను ప్రవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. జెన్ కో ఆధ్వర్యంలో మాత్...

ఎపి బిసి సంక్షేమ సంఘం జిల్లా యువజన శాఖ అధ్యక్షురాలిగా వసంత యామిని

ఎపి బిసి సంక్షేమ సంఘం జిల్లా యువజన శాఖ అధ్యక్షురాలిగా వసంత యామిని   తెనాలి: ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా యువజన శాఖ అధ్యక్షురాలిగా తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల, టీ.వీ కళాకారిణి గుంటుపల్లి వసంత యామినీ బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఆదివారం సంఘ కార్యాలయంలో ఆమెను సంఘ అధ్యక్షుడు డాక్టర్ లాకా వెంగళ రావు యాదవ్ నుంచి నియామక పత్రం అందుతున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వసంత యామిని తన నియామకానికి కృషి చేసిన సంఘ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు యనగాల నూకానమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని వసంత యామిని తెలిపారు. కార్యక్రమంలో కృష్ణాజిలా సంఘ అధ్యక్షులు మనబోతుల నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన వసంత యామినిని బుధవారం కళాకారులు బెజ్జంకి నాగమణి, సాంబశివరావు, సోమేష్, మధుకర్, జీవన్, శ్రీ శ్రీ మీడియా నిర్వహకుడు మునిపల్లి శ్రీకాంత్, రమణ, నారాయణ, ఓంకార్ తదితరులు అభినందించారు.

కేంద్ర బడ్జెట్‌–2022–23 ముఖ్యాంశాలు

* కేంద్ర బడ్జెట్‌–2022–23 ముఖ్యాంశాలు ....* – రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు – రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని రూ.15 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు కేటాయింపు – రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు – ఈ ఏడాది ద్రవ్యలోటు 6.9 గా ఉంటుందని అంచనా – 2023లో ద్రవ్యలోటు 6.4 గా ఉంటుందని అంచనా –  2022 మూలధన వ్యయం 35.4 శాతానికి పెంపు – రూ.7.50 లక్షల కోట్లు కేటాయింపు – ప్రతి తరగతికి ఒక టీవీ ఛానెల్‌ ద్వారా పాఠాలు, ప్రాంతీయ భాషల్లో పాఠాలు, ప్రస్తుతం 12 విద్యా టీవీ ఛానెల్స్‌ ఉండగా.. వీటిని 200 కి పెంపు – 2 లక్షల అంగన్వాడీ కేంద్రాల అప్‌గ్రెడేషన్‌ – 75 జిల్లాల్లో 75 ఈ–బ్యాంకులు(డిజిటల్‌ బ్యాంక్స్‌) – అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్‌ సేవలు. డిజిటల్‌ పేమెంట్, నెట్‌ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు – ఇకపై డిజిటల్‌ పాస్‌పోర్టులు. చిప్‌ ఆధారిత పాస్‌పోర్టులు మంజూరు – పీఎం గృహ నిర్మాణ పథకానికి రూ.48 వేల కోట్ల కేటాయింపులు – ప్రధాని ఆవాస్‌ యోజన కింద 80 లక్షల ఇళ్లు నిర్మాణం – అమృత్‌ పథకానికి  – అర్బన్‌ ఏరియాలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులుగా షిప్స్‌ ఉపయోగిస్తాం – పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఉన...