12న విజ్ఞాన్స్‌లో ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’ సోషల్‌ మీడియా లాంచ్‌

12న విజ్ఞాన్స్‌లో ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’ సోషల్‌ మీడియా లాంచ్‌
ముఖ్య అతిథులుగా పలువురు కేంద్ర మంత్రులు

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిలో ఆజాదీ క అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 12న ఇండియాలో డెవలప్‌ చేసిన బిగ్గెస్ట్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’ను లాంచ్‌ చేస్తున్నామని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’కు సంబంధించిన పోస్టర్, బ్రౌచర్స్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పలువురు కేంద్ర మంత్రులైన రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ స్టీల్‌ ఆఫ్‌ ఇండియా మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే, రైల్వేస్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ యూనియన్‌ మినిస్టర్‌ దర్శన జర్దోష్, సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ రామ్‌దాస్‌ బందు అత్వాలే, కమ్యూనికేషన్స్‌ ఆఫ్‌ ఇండియా మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ దేవుసిన్‌ జెసింగ్‌భాయ్‌ చౌహాన్‌లు హాజరుకానున్నారని వెల్లడించారు. ఇదే కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా, ముంబాయిలోని వాక్‌హార్డ్‌ ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ హుజాయిఫా ఖోరకివాలా, హైదరాబాద్‌లోని అక్రితి గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ కుల్దీప్‌ రైజాడ, రిటైర్డ్‌ వింగ్‌ కమాండర్‌ సత్యం కుశవాహలు హాజరుకానున్నారని పేర్కొన్నారు. ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’ సోషల్‌ మీడియా లాంచ్‌లో భాగంగా 1000 మంది విద్యార్థులు 500 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం ‘‘ సే నో టు ప్లాస్టిక్‌ ’’ అనే అంశాన్ని ప్రమోట్‌ చేస్తూ  500 మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఇండియాలో డెవలప్‌ చేసిన బిగ్గెస్ట్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘‘ఆజాదీ అప్లికేషన్‌’’ను లాంచ్‌ చేస్తున్నామని తెలియజేసారు. అనంతరం ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన జనరల్‌ బిపిన్‌ రావత్‌కు ఘన నివాళి అర్పించడంతో పాటు కోవిడ్‌ సమయంలో సేవలందించిన వారియర్స్‌ను సన్మానించడం జరుగుతుందన్నారు.