విజ్ఞాన్స్‌ లారా విద్యార్థినికి మైక్రోసాఫ్ట్‌లో రూ.12 లక్షల వార్షిక వేతనం

విజ్ఞాన్స్‌ లారా విద్యార్థినికి మైక్రోసాఫ్ట్‌లో రూ.12 లక్షల వార్షిక వేతనం

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలో నాలుగో సంవత్సరం కంప్యూటర్స్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కంచి సాయి జ్యోత్స ్నకు రూ.12 లక్షల వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగానికి ఎంపికయ్యిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో ఉండగానే మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో అసోసియేట్‌ కన్సల్టెంట్‌గా ఎంపికయ్యిందని వెల్లడించారు. ఈమెకు మైక్రోసాఫ్ట్‌ కంపెనీ 3 రౌండ్ల (రెండు టెక్నికల్, ఒకటి హెచ్‌ ఆర్‌) ఇంటర్య్వూ నిర్వహించిందని తెలిపారు. ఈమె ఇప్పటికే 6 కంపెనీల్లో (విలియమ్‌ త్రీ– రూ.7 లక్షలు, యాక్సెంచర్‌– రూ.6.5 లక్షలు, ఐబీఎమ్‌– రూ.4.5 లక్షలు, వర్చూసా– రూ.4 లక్షలు, విప్రో–రూ.3.65 లక్షలు, హెచ్‌సీఎల్‌–రూ.3.65 లక్షలు) వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగాలు సాధించిందని తెలియజేసారు. కళాశాల అధ్యాపకులు అందించిన ప్రత్యేక శిక్షణతోటి కేంబిడ్జి యూనివర్సిటీ నిర్వహించే ప్రతిష్టాత్మక పెట్‌ కోర్సును పూర్తి చేయడంతో పాటు సీ ల్యాంగ్వేజీ, డేటా స్ట్రక్చర్‌లో పూర్తి స్థాయి పట్టు సాధించిందన్నారు. ఎన్‌పీటీఈఎల్‌ పైథాన్, జావా కోర్సులు, యూడెమీలో వెబ్‌ డెవలప్‌మెంట్, కోర్‌ సెరాలో న్యాచురల్‌ ల్యాంగ్వేజీ ప్రాసెస్‌ కోర్సులను కూడా పూర్తిచేసిందన్నారు. రూ.12 లక్షల వార్షిక వేతనం సాధించిన కంచి సాయి జ్యోత్స ్నను విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు ప్రత్యేకంగా అభిందించారు.