విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాలకు రూ.13 లక్షల ప్రాజెక్ట్‌ మంజూరు


చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాలకు న్యూఢిల్లీలోని ఏఐసీటీఈ నుంచి రూ.13,39,500 లక్షల విలువైన ప్రాజెక్ట్‌ మంజూరు అయ్యిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏఐసీటీఈ– మోడరోబ్స్‌–ఏఎస్‌సీ, ‘‘మోడరైజేషన్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటిక్స్‌ ల్యాబొరేటరీ’’ పేరుతో ప్రాజెక్ట్‌ మంజూరు అయ్యిందన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు కో ఆర్డినేటర్‌గా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు, కో–కోఆర్డినేటర్‌గా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నాగం శాంతిప్రియ వ్యవహరించనున్నారని పేర్కొన్నారు. ఏఐసీటీఈ విడుదలైన ఈ ప్రాజెక్ట్‌ నిధులతో వచ్చే రెండేళ్లలో కళాశాలలో రీసెర్చ్, మౌళిక సదుపాయాల కల్పన, విద్యార్థులకు ఇంటర్న్‌షిప్స్, ల్యాబ్స్‌ ఆధునికీకరణ చేయనున్నామని వెల్లడించారు. 

అధ్యాపకురాలికి బెస్ట్‌ యంగ్‌ రీసెర్చర్‌ అవార్డు
యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా వాషింగ్టన్‌ డీసీలోని ప్రముఖ రీసెర్చ్‌ పబ్లిషింగ్‌ సంస్థైన రీసెర్చ్‌ నావెల్‌ అకాడమీ, గ్లోబల్‌ అక్రిడిటేషన్‌ అసెసెమెంట్‌ ఫోరమ్‌ సిరీస్‌ సంస్థ వారు తమ కళాశాల అధ్యాపకురాలు నాగం శాంతిప్రియకు బెస్ట్‌ యంగ్‌ రీసెర్చర్‌ అవార్డు అందించారని వెల్లడించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబుని, నాగం శాంతిప్రియను ప్రత్యేకంగా అభినందించారు.