విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈసీఈ విభాగానికి చెందిన నేలపాటి ఆనందరావుకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందజేసిందని ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ పర్ఫార్మెన్స్‌ ఆనాలిసిస్‌ ఆఫ్‌ కామ్‌పాక్ట్‌ వైడ్‌బ్యాండ్‌ యాంటీనా ఫర్‌ రేడియోలొకేషన్‌ అప్లికేషన్స్‌’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈయనకు నాగార్జున యూనివర్సిటీలోని ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ పీ.సిద్ధయ్య గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. శాటిలైట్‌లో వినియోగించే యాంటీనా పనితీరును మెరుగుపరుచడంలో ఈయన పరిశోధన ఉపయోగపడుతుందన్నారు. ఈయన తన పరిశోధనలో భాగంగా మొత్తం 3 స్కూపస్‌ జర్నల్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు.