విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి

విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి 

- ఎ.పి రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి 
- అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్ర సమర్పణ 
తెనాలి: రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి కార్యాచరణ సమితి నాయకులు వినతి పత్రాన్ని గురువారం సమర్పించారు. ఉద్యోగులకు జీతాలు పెంచకపోగా పెంచామని ప్రభుత్వ ప్రచారం చేయడం సోచనీయమని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా డిస్కం జెఎసీ ఏపి సిపిడీ సిఎల్ చైర్మన్ సీ.హెచ్ పురుషోత్తమరావు మాట్లాడుతూ ఉద్యోగులతో కుదుర్చుకున్న ఒప్పందాలను ప్రభుత్వ నేటికీ అమలు చేయడం లేదన్నారు. ప్రశ్నిస్తే ఉద్యోగులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. నూతన పీఆర్సీ స్కేలుగు వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నెల్లూరు కృష్ణపట్నం ధర్మల్ పవర్ స్టేషన్ ను ప్రవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. జెన్ కో ఆధ్వర్యంలో మాత్రమే పవర్ ప్లాంట్ ను నడపాలన్నారు. విద్యుత్ సంస్థల్లో ధీర్ఘకాలంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. జెఎసీ వైస్ చైర్మన్ ఎస్. గురుబ్రహ్మం మాట్లాడుతూ విద్యుత్ శాఖలో ఉద్యోగి చనిపోతే ఇచ్చే కారుణ్య నియామకాలను రెగ్యులర్ చేయాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసి ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పారు. విద్యుత్ ఉద్యోగులను ప్రభుత్వం కనీసం కరోన వారియర్స్ గా గుర్తించకపోవడం బాధాకరం అన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 23 తరువాత మెరుపు సమ్మెకు వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నానున్నారు. కార్యక్రమంలో డివిజన్ జేఏసీ చైర్మన్ వై. రాజు, కన్వీనర్ మోహన్, ఆర్గనైజేషన్ సెక్రటరీ అమీన్, వైస్ ప్రెసిడెంట్ డి. వెంకటేశ్వరరావు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.