ఎ.పి రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి - గాంధీ విగ్రహానికి వినతిపత్ర సమర్పణ



తెనాలి 
 దేశంలో, రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సరఫరా విభాగాల పంపిణీ అన్నింటిని ప్రభుత్వరంగంలోనే కొనసాగిస్తూ వాటి పురోభివృద్ధికి అవసరమైన సంపూర్ణమైన ప్రభుత్వ మద్దతు కల్పించవలసినదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల ఐకాస ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తుంది. ఎపియస్ పిఇ జె.ఏ.సి. పిలుపు మేరకు తెనాలి లో తెనాలి విద్యుత్ జెఏసి ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం ప్రదర్శన జరిగింది. ప్రదర్శనలో విద్యుత్ ఉద్యోగులు వారికి సహకారంగా ఇతర సంస్థలు, ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. పట్టణ వీధులలో ప్రెయిటికరణ వలన జరుగు నష్టాలను తెలియజేస్తూ, నినాదాలు చేస్తూ ప్రదర్శన విజయవంతంగా సాగింది. గాంధీ చౌక్ లో మహాత్మాగాంధీజి విగ్రహానికి పూలమాలలు వేసి, వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ దాసరి వెంకటేశ్వరరావు ఎపియస్ పి ఇ జెఏసి వైస్ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతికి, ప్రజా జీవన గమనానికి విద్యుత్ ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, అలాంటి విద్యుత్తును ప్రయివేటీకరించడం ధారుణం అని, వెంటనే ప్రభుత్వాలు ప్రయివేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులు ను వెంటనే  క్రమబద్ధీకరణ చేయలని డిమాండ్ చేశారు.
యస్ కె. నూరిల్ అమీన్ రాష్ట్ర ఎపియస్ పిఇ జెఏసి ఆర్గనైజింగ్ సెక్రటరీ మాట్లాడుతూ దీర్ఘకాలంగా అపరిష్కృతంగా వున్న సమంజసమైన సమస్యల పరిష్కారాన్ని వెంటనే పరిష్కరించాలన్నారు. ఇప్పటికి ఎన్నో పర్యాయాలు ఎన్ని విన్నపాలు చేసినా పట్టించుకోవడం లేదని, వెంటే సమస్యలను పరిష్కరించాలని, ప్రయివేటీకరణ ఉపసంహరించుకోని పక్షంలో అంచలవారీగా సమ్మెను ఉదృతం చేస్తామని చెప్పారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా తెనాలి డివిజను ఎఐటియుసి అధ్యక్షులు, ఎపిజెఏసి వైస్ చైర్మన్ యస్. గురుబ్రహ్మం, మరియు తెనాలి డివిజను జెఎసి చైర్మన్ వై. రాజు, జెఐసి కన్వీనర్ ఆర్. మోహనరావు, వైస్ చైర్మన్ డి. వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ యస్ కె. అమీన్, యస్.కెఖలీం బాషా, జె.వి.యస్. రాంబాబు, కన్నా వెంకటేశ్వరరావు, పి. సురేష్ బాబు, కె. రాజశేఖర్,  యం. శ్రీకాంత్, నాగరాజు, తదితర విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.