తెనాలి నూరేళ్ళు రంగస్థలి గ్రంథకర్త నేతి పరమేశ్వర శర్మ ఇకలేరు

రంగస్థల భీష్మాచార్యుడు.. తెనాలి నూరేళ్ళు రంగస్థలి
గ్రంథకర్త…" నేతి పరమేశ్వర శర్మ " (Nethi Paramesh
wara Sharma )  ఇకలేరు.!! 

ప్రముఖ రంగస్థల,సినీ నటులు,పరిశోథకులు 'రంగస్థల
భీష్మా చార్యుడు' " నేతి పరమేశ్వర శర్మ గారు"  (1928 2022,ఫిబ్రవరి 16) ప్రముఖ రంగస్థల నటులు,ఇకలేరన్న
వార్త తెలుగు నాటక రంగాన్ని విషాదంలో ముంచెత్తింది.
ముఖ్యంగా తెనాలి ప్రాంత నాటక రంగానికి ఆయన లేని లోటు  ఎవరూ పూరించలేనిది.
ఆయన కేవలం రంగస్థల నటుడే కాదు,'స్వాతంత్ర్యం మా జన్మహక్కు' అనే సినిమాలో నల్లూరి వెంకటేశ్వరరావు, వల్లం నరసింహారావు, ముక్కురాజు, హరీష్, ఆహుతి ప్రసాద్ లతో కలిసి నటించారు.అంతేకాదు,నాటకరంగం ప్రధానమైనా,సినిమాలన్నా కూడా ఆయన కెంతో ఇష్టం.పాటిబండ్ల దక్షిణామూర్తి గారితో..కలిసిఉత్తమ చలనచిత్ర అభిమానుల సంఘం'స్థాపించారు.దానికి తొలి అధ్యక్షులు కూడా ఆయనే.
*బాల్యం..!!

నేతి పరమేశ్వర శర్మ 1928 లో కృష్ణా జిల్లా, దివి తాలూకా నంగేగడ్డ గ్రామంలో నిమ్మగడ్డ శ్రీరాములు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు.ఆయన అయిదు సంవత్సరాల వయసులోవున్నప్పుడు తెనాలి గ్రామానికి చెందిన నేతి కమలాంబ, సీతారామశర్మ దంపతులకు దత్తపుత్రుడిగా వెళ్లారు. తెనాలి కి 2 కిలోమీటర్ల దూరంలోవున్న పెద...
రావూరు లో ఆయన బాల్యంగడిచింది. అక్కడే పెరిగి 
పెద్దయ్యారు.ఆయన నాటకరంగ  ప్రస్థానానికి తెనాలి
కార్యస్థానమైంది.అలా ఆయనకు తెనాలితో విడదీయరాని అనుబంధం ఏర్పడింది.

*నాటకరంగం…!!

బాల్యం నుంచే ఆయనకు నాటకరంగం పట్ల ఆసక్తి…. వుండింది..స్వాతంత్రోద్యమ సమయంలో పెదరావూరు గ్రామంలో ఊరేగింపులు, సమావేశాలు జరుగుతుండేవి.
నాటకాలు కూడా ప్రదర్శితమయ్యేవి.శరగారు ఆ నాటకాలను చూసేవారు.క్రమంగా నాటకాల పట్ల ఇష్టం ఏర్పడింది.తాను కూడా నాటకంలోని నటుల మాదిరిగా వేషం వేసుకొని,రంగస్థలంపై నటించాలన్న కోరిక కలిగింది.అన్న చలపతిరావు గారి ప్రోత్సాహంతో రేపల్లె లో జరిగిన …
'రంగూన్ రౌడీ ' నాటకంలో సబ్ ఇన్స్పెక్టర్ పాత్ర ధరించారు.నాటకరంగ ప్రవేశంలో అదే ఆయన మొదటి పాత్ర..
పరమేశ్వర శర్మ తెనాలి లో ప్రదర్శించిన  " పునర్జన్మ ",నాటకాన్ని చూసిన తెనాలి తాలూకా హైస్కూల్ కమిటీ కార్యదర్శి పరమేశ్వర శర్మకు ఉద్యోగం ఇచ్చారు.ఆయనఉద్యోగం చేస్తూనే నాటక రంగంలో క్రియిశీలకంగా వుండేవారు. 1956  లో విజయవాడలో నిర్వహించిన థియేటర్ వర్క్ షాప్ లో మెళకువలను నేర్చుకున్నారు. 1965లో క్రాంతి థియేటర్ బలహీనపడడంతో, నటరాజ కళామంది
ర్ అనే సంస్థను స్థాపించి రెండు సంవత్సరాల నిర్విరామంగా నాటిక, ఏకపాత్రాభినయాల పోటీలను విజయవంతంగా నిర్వహించారు.అప్పట్లో తెనాలి నాటకరంగం పరిషత్తు
లకు మాత్రమే పరిమితమవుతుండడంతో, తెనాలిలోని ఇతర సమాజాలవారితో కలిసి " ది తెనాలి యునైటెడ్ ఎమెచ్యూర్స్'  అనే నాటక సంస్థను ఏర్పాటుచేశారు.
వాలి సుబ్బారావు గారి దర్శకత్వంలో "దొంగవీరుడు "
నాటకాన్ని టికెట్లు పెట్టి ప్రదర్శించారు. ఆతర్వాత ‌….
ఆ సంస్థ మూతపడటంతో, తర్వాత  కళాభారతి అన్న సంస్థను స్థాపించి పరమేశ్వర శర్మ దర్శకత్వంలో వల్లూరి వెంకట్రామయ్య చౌదరి బాజీ ప్రభువు పాత్రలో, పరమేశ్వర శర్మ జై భవాని నాటకాన్ని ప్రదర్శించారు.
అనంతరం కొడాలి గోపాలరావు, పాలడుగుఆంజనేయులు స్థాపించిన ఆంధ్రా క్రాంతి థియేటర్ లో ఆయన సభ్యునిగా చేరారు.1952 లో ఆంధ్రా క్రాంతి థియేటర్ కి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తెనాలి కేంద్రంగా ఆంధ్రా క్రాంతి థియేటర్ తరపున ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన స్వయంగా దాదాపు 35 నుండి 40 రకాల పాత్లు ధరించారు.రంగూన్ రౌడీ,మాత్సర్యం,నామాటే నెగ్గింది,అజాత శత్రు
వు,ఆనాడు,యన్.జి.ఓ.,పరివర్తన, ఈనాడు, కప్పలు,
యుధ్దం,సందేశం,అంతార్వాణి, పునర్జన్మ, ముసుగు వీరుడు,దొంగవీరుడు,శాంతి,పేదపిల్ల, నా ఇల్లు అమ్మబడునునటనాలయం,రాణీరుద్రమ,పట్టాలు తప్పిన బండి,అనుమానం,నేటి నటుడు,అల్లీముఠా,తుఫాన్,మానవుడు,
చిరంజీవి,తెలుగు కోపం,విముక్తుడు,నాటకం, భయం
కాపలావానిదీపం,అలెగ్జాండర్,ఏ ఎండకాగొడుగ,జైభవా
నీ,పెండ్లిచూపులు తదితర నాటకాల్లో ఆయన ముఖ్య పాత్రలు పోషించారు.పునర్జన్మ నాటకం తిరుపతి నాటకపోటీల్లో ప్రదర్శించినపుడుప్రథమ బహుమతి లభించడంవిశేషం.
శర్మగారు కేవలం నాటకరంగంతో పాటు వివిధ రంగాల్లో క్రియాశీలకంగా వుండేవారు..ఉత్తమ చలన చిత్ర అభిమానుల సంఘానికీ ఆయన మొదటి అధ్యక్షులు.తెనాలి పట్టణ కళాకారుల సంఘం మొదటి ఉపాధ్యక్షులుగామవున్నారు.అభ్యుదయ కళాసమితికి  కార్యదర్శిగా పనిచేశారు.
ఉపాధ్యాయుడిగా 1986లోపదవి విరమణ చేశారు.తెనాలిలో జరిగిన అనేక నాటక పోటీలను నిర్వహించారు..ప్రజానాట్యమండలి గుంటూరు జిల్లా గౌరవాధ్యక్షులు గావున్నారు.ఆకాలంలోనే అంటే..1989లో ప్రజానాట్యమండలి గుంటూరు జిల్లా మహాసభల్నివిజయవంతంగా నిర్వహించారు.1994లో అభ్యుదయ రచయితల సంఘం స్వర్ణోత్సవ పురస్కారాల కార్యక్రమం ఆయన చేతులు మీదుగానే జరగడం విశేషం.
*పురస్కారాలు...

*2008లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం అందుకున్నారు.
*2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది సంద
ర్భంగా "కళారత్న " పురస్కారం  దక్కింది.
శర్మగారు రచించిన " నూరేళ్ళు రంగస్థలి " తెలుగు నాటకరంగస్థలానికి సంబంధించి నేటికీ ప్రామాణిక రచనగామిగిలిపోయింది..నాటకరంగం చరిత్ర,తీరుతెన్నుల  గురించి...
ఆయన ఈ గ్రంథంలో సవిస్తారంగా ప్రస్తావించారు.ఆయన
పరిశోథక దృష్టికి ఈ గ్రంథం ఓ ఉదాహరణ..!!

(*చిత్రం... మొహమ్మద్ గౌస్, హైదరాబాద్.)

*ఎ.రజాహుస్సేన్..
  నంది వెలుగు..
 గుంటూరు జిల్లా.