ఘనంగా బుద్ధా టీవీ తెనాలి కార్యాలయం ప్రారంభోత్సవం - బుద్ధ టీవీ కార్యాలయాన్ని ప్రారంభించిన జర్నలిస్ట్ సంఘనేత రత్నాకర్ - కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు ప్రెస్ అధ్యక్షుడు కుమార్ రాజా టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలిలో నూతనంగా మీడియా సంస్థ బుద్ధ టీవీ కార్యాలయాన్ని స్థానిక బలాజిరావు పేటలో గురు ప్రారంభించారు. బుద్ధ టీవీ సీఈఓ దుర్గారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ రెడ్డి, అతిధులుగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డివిజన్ కార్యదర్శి, దర్శకులు కనపర్తి రత్నాకర్, గుంటూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుమార్ రాజలు కార్యాలయంలోని స్టూడియో, నూతన గదులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ ఫైట్ ఫర్ బ్రైట్ నినాదం తో మీడియా రంగం లోకి అడుగు పెట్టిన బుద్ధ టీవీ మీడియా రంగం లో రాణించాలని ఆకాంక్షించారు. సామాన్యుడి పక్షాన నిలిచి ప్రజల సమస్యల పరిష్కారం లో తమవంతు పాత్ర పోషించాలన్నారు. తెనాలిలో వృత్తి పరంగా తమవంతు సహకారం ఉంటుందన్నారు. గుంటూరు జిల్లా బ్రాంచ్ ఇంచార్జి తిరుమల రావు మాట్లాడుతూ తె...