ప్రపంచ రంగస్థల దినోత్సవం 20 22 సందేశ కర్త-పీటర్ సెల్లర్స్* పరిచయం

*ప్రపంచ రంగస్థల దినోత్సవం 20 22 సందేశ కర్త-పీటర్ సెల్లర్స్* పరిచయం

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని పెన్సిల్వేనియాలో పిట్స్బర్గ్ లో జన్మించారు.ఒక ఓపెరా థియేటర్ను నడుపుతూ ఫెస్టివల్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టినది- ఆయన విప్లవాత్మక  వ్యాఖ్యానాత్మక ధోరణి -20వ శతాబ్ది క్లాసిక్స్ పట్ల అప్పటివరకు ఉన్న అభిప్రాయాన్ని సంపూర్ణంగా మార్చివేయ గలిగింది. సమకాలీన సంగీతానికి తన మద్దతుతో కూడిన  ప్రాజెక్టుల ద్వారా సృజనాత్మక వృత్తి కళాకారులకు మరింత విస్తృత పరిధిలో పని చేయడానికి ఉపయోగపడింది. ఆయన కళాకృతులు- కళ యొక్క శక్తివంతమైన విలువలతో కూడిన అభివ్యక్తికి, సాంఘిక చైతన్యానికి తోడ్పడ్డాయి. 

ఆయన తన ఓపెరాను-డచ్ నేషనల్ ఓపెరా, ఇంగ్లీష్ నేషనల్ ఓపెరా, ఫ్రాన్స్ లో ఎక్స్ ఆన్ ప్రొవాన్స్  (జూలై నెలలో)జరిగే వార్షిక అంతర్జాతీయ సంగీతోత్సవం, చికాగో గీతోత్సవం, పారిస్ జాతీయ నృత్యోత్సవం,సాల్జ్ బర్గ్  ఉత్సవం వంటివి కొన్ని ప్రముఖ వేదికలపై ప్రదర్శించారు. 

2020 చివరిలో కరోనాకు ప్రతిస్పందనగా తన దర్శకత్వంలో రూపొందించిన చిత్రం "ఈ శరీర అస్తిత్వం క్షణభంగురం" అని చెప్పినది. 2006లో సెల్లర్స్ వియెన్నా లో 'న్యూ క్రౌన్డ్ హోప్' అనే ఉత్సవానికి కళా దర్శకుడిగా పని చేశారు. ఇందులో సంగీతం, థియేటర్, నృత్యం, విజువల్ ఆర్ట్స్, వాస్తుకళారంగాల సమన్వయంతో, విభిన్న సాంస్కృతిక నేపథ్యాల నుండి వర్ధమాన, లబ్ధప్రతిష్టులైన కళాకారుల సహకారం తీసుకున్నాడు.

సెల్లర్స్ కు మెక్ ఆర్ధర్ ఫెలోషిప్, ఎరాస్మస్ ప్రైజ్,గిష్ ప్రైజ్ విజేత. అమెరికా అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో సభ్యుడు.పోలార్ మ్యూజిక ప్రైజ్ తో పాటు అమెరికా ఆర్టిస్ట్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికయ్యాడు.
🙏🌹
(తెలుగు అనువాదం: మల్లేశ్వరరావు ఆకుల)

*సందేశం రేపు*