విజ్ఞాన్స్‌ ఫార్మసీ విద్యార్థినికి బంగారు పతకం

విజ్ఞాన్స్‌ ఫార్మసీ విద్యార్థినికి బంగారు పతకం
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాలకు చెందిన పుట్ట చంద్రలేఖకు జేఎన్‌టీయూ కాకినాడ నుంచి బంగారు పతకం లభించిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినికి ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాకినాడ జేఎన్‌టీయూ నిర్వహించిన 8వ స్నాతకోత్సవంలో విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ పూర్తి చేసిన పుట్ట చంద్రలేఖకు బంగారు పతకాన్ని అందజేసిందని వెల్లడించారు. ఈమెకు 2016–2020 సంవత్సరాల అకడమిక్‌ ఫార్మసీ విభాగంలో జేఎన్‌టీయూ కాకినాడ పరిధిలోని అన్ని కాలేజీలలోని విద్యార్థుల కంటే ఎక్కువ మార్కులు (88.76 శాతం) సాధించినందుకు ఈమెకు బంగారు పతకం లభించిందని తెలియజేసారు. ప్రస్తుతం ఈమె నైపర్‌–గౌహతిలో ఫార్మాస్యూటికల్స్‌ విభాగంలో ఎంఎస్‌ చదవుతుందని తెలియజేసారు. బంగారు పతకం సాధించిన పుట్ట చంద్రలేఖను విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, కళాశాల అధ్యాపక సిబ్బంది అభినందించారు.