విజ్ఞాన్స్‌ వర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ వర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌  మెకానికల్‌ విభాగానికి చెందిన బాచిన హరీష్‌బాబుకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందజేసిందని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ మోడలింగ్‌ అండ్‌ ఆప్టిమైజేషన్‌ ఆఫ్‌ డెడ్‌ మెటల్‌ జోన్‌ టు మినిమైజ్‌ కటింగ్‌ అండ్‌ త్రస్ట్‌ ఫోర్సెస్‌ ఇన్‌ మిల్లింగ్‌ ఆఫ్‌ ఏఐఎస్‌ఐ డీ2 స్టీల్‌’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేశారు. ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని మెకానికల్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ కే.వెంకటరావు గైడుగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన తన పరిశోధనలో  2 ఎస్‌సీఐ మరియు 2 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్లు ప్రచురించారు. పీహెచ్‌డీ పట్టా పొందిన బాచిన హరీష్‌బాబును విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ప్రత్యేకంగా అభనందించారు.