టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' విడుదల సందర్భంగా.. హైదరాబాద్‌కు చెందిన ఓ చిత్రకారుడు చిత్ర బృందానికి వినూత్నంగా ఆల్‌ది బెస్ట్ తెలిపాడు. నిజాంపేట్‌కు చెందిన సద్గురు ది స్కూల్ అఫ్ ఆర్ట్స్ వ్యవస్థాపకులు... ప్రముఖ నాసికా చిత్రకారుడు సత్యవోలు రాంబాబు.. ముక్కుతో డైరెక్టర్ రాజమౌళితో పాటు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ చిత్రాలను చిత్రించి యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు.
విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్’’ సినిమా యూనిట్ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్, దర్శకుడు అశ్విన్ రామ్, ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్స్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్ ’’ సినిమాను నిర్మించారు. సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు. ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్ కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....