విజ్ఞాన్స్‌లో వైభవంగా సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శన

విజ్ఞాన్స్‌లో వైభవంగా సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శన
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థులు సత్యహరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించారని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ యాక్టివిటీ కౌన్సిల్‌లోని థియేటర్‌ ఆర్ట్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ‘‘ వరల్డ్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ డే’’ను పురస్కరించుకుని సత్యహరిశ్చంద్ర నాటకాన్ని వైభవంగా ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు  మాట్లాడుతూ నాటకం సర్వజననీయం, సర్వకాలీనమన్నారు. ప్రాముఖ్యత కలిగిన అతి ప్రాచీన కళల్లో నాటక రంగం కూడా ఒకటన్నారు. ప్రస్తుతమున్న నాటక రంగం కాలక్రమేణా రూపం మార్చుకుంటా విశ్వజననీయమయ్యిందన్నారు. విద్యార్థులు ప్రజలకు నాటర రంగం ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు. నాటకాలు ప్రదర్శించడం ద్వారా విద్యార్థులు మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చునన్నారు. అనంతరం నాటక ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ప్రశంసా పత్రాలను అందజేసారు.