అన్ని రంగాల్లో రాణించాలి

అన్ని రంగాల్లో రాణించాలి

  గుంటూరు జడ్పీ చైర్‌పర్సన్‌ హెన్రీ క్రిస్టీనా

  స్త్రీలు శక్తిస్వరూపులు : ఫ్యామిలీ కౌన్సిలర్‌ డాక్టర్‌ జీవన లత దర్శి

  మహిళల్లోనే వైవిధ్యమైన నాయకత్వ లక్షణాలు : ఏవీకే సుజాత

  అవకాశాల కోసం ఎదురుచూడొద్దు : విజ్ఞాన్స్‌ వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌

  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ఇంటర్నేషనల్‌ మహిళా దినోత్సవ వేడుకలు

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని గుంటూరు జడ్పీ చైర్‌పర్సన్‌ హెన్రీ క్రిస్టీనా అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో మంగళవారం ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు జడ్పీ చైర్‌పర్సన్‌ హెన్రీ క్రిస్టీనా మాట్లాడుతూ స్త్రీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. ఎందరో మహిళలు దేశ నాయకులుగా చరిత్ర సృష్టిస్తూ, జాతి దశను, దిశను మార్చేస్తున్నారని తెలిపారు.

స్త్రీలు శక్తిస్వరూపులు : ఫ్యామిలీ కౌన్సిలర్‌
డాక్టర్‌ జీవన లత 
స్త్రీలు స్వతహాగా శక్తి స్వరూపులని డయాబెటాలజిస్ట్‌ అండ్‌ ఫ్యామిలీ కౌన్సిలర్‌ డాక్టర్‌ జీవన లత  తెలియజేసారు. మహిళలు జీవితంలోను, సమాజంలోని సమస్యలపై గట్టిగా పోరాడాలని తెలిపారు. మహిళలు ఎప్పుడూ కూడా తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. తమ బలాలను పెంచుకుంటూ బలహీనతలను అధిగమించాలన్నారు. 

మహిళల్లోనే వైవిధ్యమైన నాయకత్వ లక్షణాలు : ఏవీకే సుజాత
మగవారితో పోలిస్తే మహిళల్లోనే వైవిధ్యమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయని ప్రముఖ ప్రచారకర్త, రిటైర్డ్‌ తెలుగు పండితురాలు ఏవీకే సుజాత తెలిపారు. సవాళ్లను అధిగమించే విషయంలో మగవారి కంటే మహిళలే ప్రభావవంతంగా పనిచేస్తున్నారని వెల్లడించారు. మగవారితో పోల్చుకుంటే మహిళలే మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారని పేర్కొన్నారు.  మహిళలు ఒక సమస్యను వేర్వేరు కోణాల్లో నుంచి ఆలోచించగలరని తెలిపారు. 

అవకాశాల కోసం ఎదురుచూడొద్దు : విజ్ఞాన్స్‌ వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌
మహిళలు అవకాశాల కోసం ఎవరి కోసమో ఎదురుచూడొద్దని, విజ్ఞానం, నైపుణ్యం పెంచుకుంటే స్త్రీలు ఏదైనా సాధించొచ్చని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ పేర్కొన్నారు. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ  మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదన్నారు.  మహిళాభ్యుదయం గురించి ఏదో ఒక రోజు మాట్లాడటం కాదని, వారి ఉన్నతికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం రోజూ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు, అధ్యాపకులకు బహుమతులను అందజేసారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు.