విజ్ఞాన్స్‌ వర్సిటీతో అస్పైర్‌– యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ వర్సిటీతో అస్పైర్‌– యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ అవగాహన ఒప్పందం

చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో హైదరాబాద్‌లోని అస్పైర్‌–యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ విశ్వవిద్యాలయాల మధ్య  అవగాహన ఒప్పందం జరిగిందని యూనివర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పీఎంవీ రావు అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను అస్పైర్‌–యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ జీవీ ప్రసాద్‌కు  అందజేసారు. ఈ సందర్భంగా ఇంచార్జి రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన రీసెర్చ్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, కొలబరేటివ్, రివ్యూవింగ్‌ ప్రాజెక్టులు, వర్క్‌షాప్స్, మెంటర్‌షిప్‌ ఫర్‌ స్టార్టప్స్, ఇంటర్న్‌షిప్స్, రీసెర్చ్‌ ల్యాబ్స్‌ వసతులను వినియోగించుకోవటం ద్వారా పురోభివృద్ధిని సాధిస్తామని తెలియజేసారు.