Skip to main content

Posts

Showing posts from April, 2022

విజ్ఞాన్స్‌లో ఘనంగా జాతీయస్థాయి ఫుడో–ఫీస్టా 2కే22

విజ్ఞాన్స్‌లో ఘనంగా జాతీయస్థాయి ఫుడో–ఫీస్టా 2కే22 చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో నేషనల్‌ లెవల్‌ ‘‘ ఫుడో–ఫీస్టా 2కే22’’ను శనివారం ఘనంగా నిర్వహించారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెనాలిలోని డబుల్‌ హార్స్‌ జనరల్‌ మేనేజర్‌ క్రిష్ణ ప్రసాద్‌ ఎన్‌వీ పోలిశెట్టి మాట్లాడుతూ విద్యార్థులందరూ సాంప్రదాయ ఆహారపు అలవాట్లను భవిష్యత్‌ తరాలకు అందజేయాల్సిన బాధ్యతను తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలన్నారు. అందుకు మంచి ఆహారం, వ్యాయామం, నిద్ర అవసరమని తెలిపారు. శ్రద్ధగా చదువుకోవాలని చెప్పారు. ఆరోగ్యంగా ఉండి, శ్రద్ధగా చదువుకునే విద్యార్థులు జీవితంలో ఏ అవకాశాన్నయినా అందిపుచ్చుకోగలరని, ఉన్నత శిఖరాలను చేరుకోగలరని వివరించారు. లియో గ్లోబల్‌ ఓవర్‌సీస్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ లగడపాటి వీరాంజనేయులు మాట్లాడుతూ ఫుడ్‌ టెక్నాలజీ పూర్తిచేసిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. విద్యార్థులు లక్ష్యసాధన కోసం పాటుపడాల...

విజ్ఞాన్స్‌లో కళ్యాణమస్తు సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో కళ్యాణమస్తు సినిమా యూనిట్‌ సందడి చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం బోయపాటి అగస్త్య సమర్పణలో ఎస్‌ఎమ్‌ఎస్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మించిన ‘‘కళ్యాణమస్తు’’ సినిమా యూనిట్‌ సందడి చేసింది. విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు పుట్టినరోజుతో పాటు ఇంటర్నేషనల్‌ డ్యాన్స్‌ డేనే పురస్కరించుకుని కళ్యాణమస్తు సినిమాలోని కొరియోగ్రాఫర్ అమ్మ సుధీర్ గోగినేని నృత్యరీతులు అందించిన ‘‘ముక్కుపుడక’’ అనే సాంగ్‌ను అట్టహాసంగా లాంచ్‌ చేశారు. శేఖర్‌ వర్మ, వైభవి రావ్‌ హీరో హీరోయిన్లుగా  ఓ.సాయి దర్శకత్వంలో బోయపాటి రఘుబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘ముక్కుపుడక’’ అనే సాంగ్‌ను ప్రముఖ గాయని మంగ్లీ, గాయకుడు రఘురామ్‌ ఆలపించారు. ఈ సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఆర్‌.ఆర్‌ ధృవన్, కెమెరామెన్‌గా మల్లికార్జున్‌ నారగాని, లిరిక్‌ రైటర్‌గా అలరాజు పనిచేశారు. హీరో శేఖర్‌ వర్మ మాట్లాడుతూ మూవీ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిర్మించామని... చిత్రం తప్పకుండా అందర్నీ అలరిస్తుందన్నారు. సినిమాలో ట్విస్టులు, కామెడీ, ఎమోషన్స్, డ్రామా, ఫ...

విజ్ఞాన్స్‌ విద్యార్థికి ప్రతిష్టాత్మక జాతీయస్థాయి ఫెలోషిప్‌

విజ్ఞాన్స్‌ విద్యార్థికి ప్రతిష్టాత్మక జాతీయస్థాయి ఫెలోషిప్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ విభాగానికి చెందిన మూడో సంవత్సరం విద్యార్థి బిల్లపాటి మణికంఠకు జాతీయస్థాయి ఫెలోషిప్‌ లభించిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐఏఎస్‌సీ–ఐఎన్‌ఎస్‌ఏ–ఎన్‌ఏఎస్‌ఐ సమ్మర్‌ రీసెర్చ్‌ ఫెల్లోషిప్‌–2022కు మణికంఠ ఎంపికైనట్లు వెల్లడించారు. ఈ ఫెల్లోషిప్‌ను ఇండియన్‌ అకడమీ ఆఫ్‌ సైన్సెస్, ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకడమీ, నేషనల్‌ అకడమీ ఆఫ్‌ సైన్స్‌ ఇండియా వంటి 3 అకాడమీలు కలిపి ఈ ఫెలోషిప్‌ను అందజేస్తారని పేర్కొన్నారు. బిల్లపాటి మణికంఠకు భోపాల్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ అకడమీలోని డాక్టర్‌ నితిన్‌ టీ పటిల్‌ గైడ్‌గా వ్యవహరించున్నారని తెలియజేసారు. 8 వారాల పాటు జరిగే ఈ ప్రతిష్టాత్మక జాతీయస్థాయి ఫెలోషిప్‌కు ఎంపికైనందుకు మణికంఠకు రూ.25,000 లు స్టైఫండ్‌ అందిస్తారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎంపికచేసిన 140 మంద...

జన్మదినోత్సవ శుభాకాంక్షలు ప్రేమ్ రంజన్

విజ్ఞాన్స్‌లో ఘనంగా అవగాహన వెబినార్‌

విజ్ఞాన్స్‌లో ఘనంగా అవగాహన వెబినార్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఈ–సెల్‌ ఆధ్వర్యంలో వరల్డ్‌ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ డేను పురస్కరించుకుని ‘‘ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ ఆన్‌ అకడమియా’’ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన వెబినార్‌ను నిర్వహించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. వర్చువల్‌ విధానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్ర యూనివర్సిటీ డీపీఐఐటీ–ఐపీఆర్‌ చైర్‌ ప్రొఫెసర్‌ హెచ్‌.పురుషోతమ్‌ మాట్లాడుతూ విద్యార్థులు నిరంతరం పరిశోధనలపై దృష్టి సారించాలన్నారు. సరికొత్త ఇన్నోవేషన్స్‌ను సృష్టించే విద్యార్థులు వాటిపై పేటెంట్స్‌ను పొందడం వలన దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులు పేటెంట్స్‌ను సాధించడానికి ఎలా ప్రయత్నించాలో దశల వారీగా వివరించారు. కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత ప్రభుత్వ నిపమ్‌ ఇండియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ ఎగ్జామినర్‌ లావణ్య మద్దురి మాట్లాడుతూ రీసెర్చ్‌ జర్నల్స్‌కు– పేటెంట్స్‌కు మధ్య వ్యత్యాసాలను విద్యార్థులకు విశదీకరించారు. రీస...

ఆగస్టు 14,15 తేదీల్లో షార్ట్ ఫిల్మ్ పోటీలు

ఆగస్టు 14,15 తేదీల్లో షార్ట్ ఫిల్మ్ పోటీలు   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: పోస్టర్ ఆవిష్కరిస్తున్న తెలుగు షార్ట్ ఫిల్మ్ సంఘ ప్రతినిధులు కృష్ణలంక(విజయవాడ తూర్పు): స్వాతంత్ర్య వజోత్సవాన్ని పురస్క రించుకుని ఆగస్టు 14, 15 తేదీల్లో షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నా మని తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసి యేషన్ ప్రధాన కార్యదర్శి డి.వి. రాజు పేర్కొన్నారు. విజయవాడ గవర్నర్ పేటలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్ర వారం షార్ట్ ఫిల్మ్ పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరుగుతున్న దురాచా రాలను వ్యతిరేకిస్తూ షార్ట్ ఫిల్మ్ లు ఉండాలన్నారు. షార్ట్ ఫిల్మ్ నిడివి 10 నిమిషాలకు మించరాదని, కుల మతాలకు అతీతంగా, అశ్లీలతకు తావు లేకుండా ఉండాలన్నారు. ప్రదర్శనకు ఎంపికైన 30 చిత్రాలకు నగదు బహుమతి, మెమొంటో ఇవ్వ నున్నట్టు చెప్పారు. షార్ట్ ఫిల్మ్ లను జూలై 31 లోగా పంపాలని, వివరా లకు 93911 63508 నంబర్లో సం ప్రదించాలని కోరారు. ఈ కార్యక్ర మంలో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్, కమిటీ సభ్యులు ప్రేమ చం ద్, అశోక్, జగదీష్, ఐజాక్ న్యూటన్ పాల్గొన్నారు.

విద్యార్థులకు బస్ లో ఉచిత ప్రయాణం

విద్యార్థులకు బస్ లో ఉచిత ప్రయాణం ఈనెల 27 నుండి మే 9వ తారీకు వరకు  పదవ తరగతి విద్యార్థులకు బస్ లో  ఉచిత ప్రయాణ సదుపాయం. అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసిన ఏపీఎస్ ఆర్టీసీ...

సినెటేరియాతో సినిమా నిర్మాణం ఇక ఈజీ..

సినెటేరియాతో  సినిమా నిర్మాణం ఇక ఈజీ  , సినెటేరియాతో - సినిమా నిర్మాణం ఇక ఈజీ..! సినెటేరియాతో చేతులు కలపండి. మీ సినిమా నిర్మాణం తక్కువ ఖర్చుతో పూర్తిచేయండి.  సినెటేరియా మీ చిత్రానికి కావలసిన 60 శాతం లొకేషన్స్, కాస్ట్యూంస్, సెట్ ప్రాపర్టీ, ఇంటీరియర్ డెకొరేషన్, ల్యాండ్ స్కేప్స్ మరియు వెహికిల్స్.. ఉచితంగా అందిస్తుంది.  ఇంకా, మీ సినిమాకు కొన్ని లక్షల రూపాయల పబ్లిసిటీని, సినిమా ప్రొమోషనల్ ఈవెంట్లను కూడా ఉచితంగా అందిస్తుంది.  మీ సినిమాలో బ్రాండింగ్ కు సరైన ప్లేస్ మెంట్ ఉంటే, ఇన్-ఫిలిం బ్రాండింగ్ ద్వారా నిర్మాతకు బ్రాండింగ్ ఫండ్ కూడా సమకూరుస్తుంది. మరిన్ని వివరాలకోసం సినెటేరియాను సంప్రదించండి. సినెటేరియా మీడియా వర్క్స్ హైదరాబాద్, తెలంగాణ, ఇండియా ఫోన్: 095534 59355 Website: http://cinetaria.in

అత్యాచారానికి పాల్పడిన నేరస్తులను పట్టుకోవడంలో జాప్యం లేకుండా వ్యవహరించాలి

అత్యాచార ఘటనపై పారదర్శక విచారణకు ఆదేశాలు - విజయవాడ సీపీతో మాట్లాడిన 'వాసిరెడ్డి పద్మ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్, అమరావతి: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ గురువారం సత్వరమే స్పందించింది. ఘటన వివరాలు ఆరాతీసి సీరియస్ గా రంగంలోకి దిగింది. ఈమేరకు కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటాతో ఫోన్ లో మాట్లాడారు. కేసు పూర్వాపరాలు తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన నేరస్తులను పట్టుకోవడంలో జాప్యం లేకుండా వ్యవహరించాలని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలివ్వాలని ఆమె కోరారు. మీడియాలో వస్తున్న రాజకీయ ఆరోపణల్ని దృష్టిలో ఉంచుకుని కేసును పారదర్శక విచారణతో నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాధితురాలి ఆరోగ్యం విషయంలో తగిన వైద్యం సక్రమంగా అందించాలని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ను వాసిరెడ్డి పద్మ ఆదేశించారు.

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు రూ.కోటి డీఎస్టీ ప్రాజెక్ట్‌ మంజూరు

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు రూ.కోటి డీఎస్టీ ప్రాజెక్ట్‌ మంజూరు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకి న్యూఢిల్లీలో గల డీఎస్టీలోని అడ్వాన్డ్స్‌ మ్యానుఫ్యాక్చురింగ్‌ కేటగిరీలో రూ.కోటి విలువ గల ప్రాజెక్టు మంజూరైందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘కాస్ట్‌ ఎఫెక్టివ్‌ ఆటోమేటెడ్‌ అడిటివ్‌ మ్యాన్యుఫ్యాక్చురింగ్‌ హబ్‌ ఫర్‌ సస్టేనబిలిటీ ఆఫ్‌ ఎంఎస్‌ఎమ్‌ఈస్‌’’అనే అంశంపై పరిశోధనకు గాను రాబోయే 3 సంవత్సరాలకు గ్రాంటు మంజూరైందన్నారు. ఈ ప్రాజెక్టు వలన ఆటోమొబైల్‌ రంగంలో మెటల్‌ పరికరాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం ఉపయోగపడేలా త్రీడీ ప్రింటింగ్‌ మెషీన్‌ను తయారుచేస్తారు. ఈ ప్రాజెక్టు సహాయంతో తక్కువ సమయంలో ఎక్కువ మన్నికైన త్రీడీ ప్రింటింగ్‌ డేటా బేస్‌ను రూపొందించవచ్చు. ఈ ప్రాజెక్టు రూపకల్పనలో కృషి చేసిన మెకానికల్‌ విభాగానికి చెందిన అధ్యాపకులను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ప్రత్యేకంగా అభినందించారు.

చురుగ్గా అంబేడ్కర్ స్మృతివనం పనులు

చురుగ్గా అంబేడ్కర్ స్మృతివనం పనులు .  - ప్రతి 15 రోజులకు సమీక్ష నిర్వహించాలని    మంత్రి మేరుగ నాగార్జున ఆదేశం.  విజయవాడ స్వరాజ్ మైదానంలో చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం పనులు చురుగ్గా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి మేరుగ నాగార్జున ఆదేశించారు. మంగళవారం సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వచ్చే ఏడాది అంబేడ్కర్ జయంతి నాటికి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిర్మాణ పనులు ప్రగతిపై 15 రోజులకొకసారి సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. పనులు ఆలస్య మవ్వకుండా చర్యలు తీసుకోవాలని.. అలసత్వాన్ని క్షమించబోనని హెచ్చరించారు. పెరుగుతున్న ధర లకు అనుగుణంగా సాంఘిక సంక్షేమ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. అంబేడ్కర్ విదేశీ విద్యా నిధి పథకం కింద విద్యార్థులకు మరింత ప్రయో జనం చేకూర్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 ప్రతిష్టాత్మక యూనివర్సిటీలతో యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకుంటున్నట్లు తెలిపారు.

గుంటూరు జీజీహెచ్ ప‌రిస్థితుల‌పై ఆగ్ర‌హం

రంగంలోకి మంత్రి విడ‌ద‌ల ర‌జని - జీజీహెచ్  ప‌రిస్థితుల‌పై ఆగ్ర‌హం ఏపీలో మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రిగా ప‌ద‌విని ద‌క్కించుకున్న చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌దల ర‌జని మంత్రి హోదాలో విధి నిర్వ‌హ‌ణ‌లోకి దూకేశారు. బుధ‌వారం మంత్రి హోదాలో ఆమె గుంటూరు గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్ (జీజీహెచ్‌)ని త‌నిఖీ చేశారు. ఆసుప‌త్రిలోకి వెళ్లిన ఆమె మొత్తం ఆసుప‌త్రిలోని అన్ని విభాగాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తూ సాగారు. ఈ సంద‌ర్భంగా అత్య‌వ‌స‌ర చికిత్సా విభాగంలో ఏసీలు ప‌నిచేయ‌ని తీరును గుర్తించిన మంత్రి... ఏసీలు ఎప్ప‌టి నుంచి ప‌నిచేయ‌డం లేద‌ని అధికారుల‌ను ప్ర‌శ్నించారు. 6 నెల‌లుగా ఏసీలు ప‌ని చేయ‌లేద‌ని తెలుసుకున్న ఆమె ఇంత‌కాలంగా ఏసీలు ప‌నిచేయ‌కుంటే మీరేం చేస్తున్నారంటూ ఎలక్ట్రిక్ విభాగం ఏఈని నిల‌దీశారు. ఇక‌పై విధి నిర్వ‌హ‌ణ‌లో నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తే స‌హించేది లేద‌ని ఆమె హెచ్చరిక‌లు జారీ చేశారు. ఆ త‌ర్వాత ఆసుప‌త్రిలోని అన్ని విభాగాల‌ను ర‌జని ఆయా విభాగాల్లోని స‌మ‌స్య‌లపై అధికారుల‌తో చ‌ర్చించారు.

విజ్ఞాన్స్‌ లారా అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ లారా అధ్యాపకుడికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలోని ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన అధ్యాపకుడు షేక్‌ గౌస్‌ భాషకు విజ్ఞాన్స్‌ యూనివర్సటీ   పీహెచ్‌డీ పట్టా అందించిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్ర కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఫెర్మార్మెన్స్‌ అనాలిసిస్‌ ఆఫ్‌ మోడిఫైడ్‌ థర్టీన్‌ లెవల్‌ ఇన్వెర్టర్‌ ఫర్‌ షంట్‌ యాక్టివ్‌ పవర్‌ ఫిల్టర్‌’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈఈఈ డిపార్ట్‌మెంట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎం.సుబ్బారావు, విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలోని ప్రొఫెసర్‌ ఎం.వెంకటేసన్‌లు సంయుక్త గైడ్‌లుగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన పరిశోధనలో భాగంగా మొత్తం 1 ఐఈఈఈ ఎస్‌సీఐ, 2 ఈఎస్‌ఐ, 3 స్కూపస్‌ జర్నల్‌ పబ్లికేషన్, 2 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్లు, ఒకటి బుక్‌ చాప్టర్‌ పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. డాక్టరేట్‌ పొందిన షేక్‌ గౌస్‌ భాషను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లా...

కోవిడ్‌–19పై పుస్తకం రాసిన విజ్ఞాన్స్‌ విద్యార్థిని

కోవిడ్‌–19పై పుస్తకం రాసిన విజ్ఞాన్స్‌ విద్యార్థిని చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని మొదటి సంవత్సరం సీఎస్‌ఈ విభాగానికి చెందిన యడ్లపాటి గాయత్రీ  బాల కోవిడ్‌–19పై పుస్తకం రాసిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ డైరీ ఆఫ్‌ కోవిడ్‌–19 జర్నీ’’ అనే పేరుతో  కెనడాలోని ప్రముఖ పబ్లిషర్స్‌ యూకీయోటో వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారని పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని కరోనా పాయింట్‌ ఆఫ్యూలో రాసిందని తెలియజేసారు. కరోనా ఎలా పుట్టింది? ప్రపంచం మొత్తం ఎలా వ్యాపించింది? ఎంతమందిని బలితీసుకుంది? వివిధ రూపాల్లోకి ఎలా రూపాంతరం చెందింది? వ్యాక్సిన్‌ ఎలా తయారయ్యింది? ఇలా పలు అంశాలను బుక్‌లో ప్రస్తావించిందని వెల్లడించారు. అంతేకాకుండా ఈమె పియానో, గిటార్, వయోలిన్, వోకల్, వెంట్రిలాకిజమ్, రైటింగ్స్, స్పీకింగ్స్, ఎంబ్రాయిడింగ్, సింగింగ్‌ వంటి కళల్లో ప్రావీణ్యం కూడా ఉందన్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మళయాళం, సాంస్క్రిట్, కొరియన్, అమెరికన్‌ సైన్‌ ల్యాంగ్వేజ్‌ వంటి భాషల్లో కూడా మంచి పట్టు ఉందన...

నిరుపేదల సంక్షేమం, అభ్యున్నతికి పెద్దపీఠవేసిన ప్రభుత్వం

నిరుపేదల సంక్షేమం, అభ్యున్నతికి పెద్దపీఠవేసిన ప్రభుత్వం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అమరావతి, ఏఫ్రిల్ 19 :   రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి పెద్ద పీఠవేస్తూ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. అయితే పలు వర్గాల ప్రజలకు నేరుగా లబ్దిచేకూర్చే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT)  పథకాల వల్ల భవిష్యత్తులో తమ మనుగడగే కనుమరుగు అవుతుందన్న ఆలోచనలో ఉన్న ప్రతిపక్షపార్టీ తమ అనుకూల ప్రచార మాధ్యమాల ద్వారా ప్రభుత్వంపై దుష్రచారానికి పాల్పడుతున్నదన్న ఆవేదనను ఆయన వ్యక్తంచేశారు. ఇటు వంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, వారు ఎంతో విజ్ఞులని, ప్రతిపక్షపార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం అమలు పర్చే సంక్షేమ పథకాలను అన్నింటినీ రద్దు చేస్తుందనే విషయం వారికి తెలుసని ఆయన అన్నారు. మంగళవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుత...

శ్రీ శివ లింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో సాయిబాబాగుడి వంతెన వద్ద ది.19-4-2022 ఉ॥ 11.గం॥ లకు గౌరవశాసన సభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి చే చలివేంద్రం ప్రారంభం

శ్రీ శివ లింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి  వారి ఆధ్వర్యంలో సాయిబాబాగుడి వంతెన వద్ద  ది.19-4-2022 ఉ॥ 11.గం॥ లకు గౌరవ శాసన సభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి చే చలివేంద్రం ప్రారంభం . - అధ్యక్షులు కుర్రా శ్రీను Cell : 9959595927

విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌

విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్, విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ సంయుక్త సహకారంతో డీఎస్టీ స్పాన్సర్డ్‌ నేషనల్‌ లెవల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ను వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ వైబ్రేషన్‌ బేస్డ్‌ ప్రొడక్టర్‌ క్వాలిటీ అండ్‌ కండీషన్‌ మోనిటరింగ్‌ సిస్టమ్స్‌ ఇన్‌ అడ్వాన్స్‌›్డ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఎస్‌టీయూటీఐ ప్రోగ్రామ్‌–2021’’ అనే అంశంపై ఈ సెమినార్‌ను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గీతం యూనివర్సిటీ ఎస్‌టీయూటీఐ ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ బల్లా శ్రీనివాస ప్రసాద్‌ మాట్లాడుతూ వైబ్రేషన్‌ లెవల్‌ ఆధారిత ఎక్విప్‌మెంట్‌లో పట్టు సాధించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు.  కండీషన్‌ మోనిటరింగ్‌ సిస్టమ్స్‌ ఇన్‌ అడ్వాన్స్‌›్డ మ్యానుఫ్యాక్చరింగ్‌లో పరిశోధనలు చేయడానికి విద్యార్థులకు ఎన్నో...

విజ్ఞాన్స్‌ లారాకు ప్రతిష్టాత్మక ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌

విజ్ఞాన్స్‌ లారాకు ప్రతిష్టాత్మక ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు ప్రతిష్టాత్మక ఎన్‌బీఏ( నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌) అక్రిడిటేషన్‌ సాధించిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఎన్‌బీఏ నుంచి 4 అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ లభించడం గర్వకారణమన్నారు. అక్రిడిటేషన్‌ లభించిన కోర్సులలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. లారా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ మాట్లాడుతూ ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌కు సంబంధించిన తనీఖీ బృందం విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలో 2022 సంవత్సరం మార్చి 4 నుంచి మూడు రోజుల పాటు ప...

ఏ.పీసాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున శుభాకాంక్షలు తెలియజేసిన తెనాలి నియోజకవర్గం శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్.

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు మేరుగ నాగార్జున పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సచివాలయంలోని ఆయన ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేసిన తెనాలి నియోజకవర్గం శాసన సభ్యులు  అన్నాబత్తుని శివకుమార్.

మాజీ హోం మంత్రి ని కలిసినమంత్రి మేరుగు నాగార్జున

మాజీ హోం మంత్రి ని కలిసిన మంత్రి మేరుగు నాగార్జున గుంటూరు, ఏప్రిల్ 16:  రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. మేరుగు నాగార్జున హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత ను మర్యాద పూర్వకంగా కలిసి మాట్లాడారు. శనివారం గుంటూరు లోని సుచరిత స్వగృహానికి వెళ్లి ఆమెను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన మంత్రివర్గంలో స్థానం సాధించినందుకు నాగార్జున ను సుచరిత అభినందించారు. ప్రజల ఆదరణ పొందేలా పని చేసి మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ, సీఎం జగన్ ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ భావజాలంతో కొనసాగుతున్న ప్రభుత్వం లో దళిత బహుజనులకు లభిస్తున్న ఆదరణ చారిత్రాత్మమైనదని చెప్పారు. దళితులు అందరూ కలిసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెన్నంటి నడవాలని, రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందడానికి చేయూతను ఇవ్వాలని నాగార్జున కోరారు.

ఇళ్ల స్థలాల కోసం 11 వేల మంది జర్నలిస్టులు వెయిటింగ్

ఇళ్ల స్థలాల కోసం 11 వేల మంది జర్నలిస్టులు వెయిటింగ్ ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో సానుకూల నిర్ణయం అందరి సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర సమాచార, పౌర  సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ సింహాచలం... రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు సంభందించిన  పెండింగ్ సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో చర్చించడం జరుగుతుందని రాష్ట్ర సమాచార, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఆదివారం ఉదయం సింహాద్రినాధుడు ను  దర్శించుకున్న అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, సహచర జర్నలిస్టులు బృందం జర్నలిస్టుల ఇళ్లస్థలాలకు సంబంధించిన సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మూడు సెంట్ల స్థలము,  హెల్త్ కార్డు, ప్రమాద బీమా పాలసీ తో పాటు కలిపి ఒక ప్యాకేజీ గాఅందిస్తామని ముఖ్యమంత్రి గతములో హామీ ఇవ్వడం జరిగిందని, దానిని నెరవేర్చే దిశగా కృషి చేయా...

పాత్రికేయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

పాత్రికేయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా   - అంబేద్కర్ ఎల్టెన్సీ అవార్డ్స్ ప్రదానోత్సవంలో    జెడ్పీ చైర్ పర్సన్ క్రిస్టినా  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ప్రభుత్వానికి, ప్రజలకు మద్య వారధిగా ఉంటూ నిత్యం ప్రజాశ్రేయస్సుకు పాటుపడే పాత్రికేయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని జిల్లా పరిషత్ చైర్ పర్సస్ కత్తెర హెనిక్రిస్టీనా అన్నారు.  టాలెంట్ ఎక్స్ ప్రెస్, శ్రీశ్రీమీడియా, అ షేర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక పుట్టి నాగేశ్వరరావు కల్యాణ మండపంలో బుధవారం రాత్రి ఎంపిక చేసిన జర్నలిస్టులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్స్ లెన్సీ  పురస్కారాలను  ప్రధానం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సభకు టాలెంట్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్, ఏపిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి, దర్శకుడు కనపర్తి రత్నాకర్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన క్రిస్టినా  మాట్లాడుతూ అస్పృశ్యతపై తన గళాన్ని వినిపించేందుకు స్వతహాగా అంబేద్కర్ పత్రికలను స్థాపించారన్నారు. ఐఅండ్ పిఆర్ డిప్యూటీ  డైరెక్టర్...

జర్నలిస్టుకు అంబేద్కర్ ఎక్సలెన్సీ పురస్కారాల ప్రదానం

జర్నలిస్టులకు  అంబేద్కర్ ఎక్సలెన్సీ పురస్కారాల ప్రదానం తెనాలి: 14-04-2022: పత్రికారంగం గత 20 సంవత్సరాలుగా విశేష సేవలందిస్తున్న ఆరుగురు జర్నలిస్టులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం తెనాలిలో ఘనంగా జరిగింది.  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని టాలెంట్ ఎక్స్ ప్రెస్, శ్రీశ్రీ మీడియా, అషేర్ చారిటబుల్ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో బుధవారం రాత్రి స్థానిక పుట్టి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎల్టెన్సీ - 2022 పురస్కార ప్రధానోత్సవములో ముఖ్యఅతిధిగా  గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హెనీ క్రిస్టినా సురేష్ పాల్గొన్నారు. సభకు కార్యక్రమ నిర్వాహకులు, తెనాలి డివిజన్ ఏపిడబ్ల్యూజెఎఫ్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రత్నాకర్ అధ్యక్షత వహించారు. హెనీ క్రిస్టినా సురేష్ మాట్లాడుతూ ఎంతో క్లిష్టమైన వృత్తి జర్నలిజం అని, ప్రజలను చైతన్య వంతం చేయడంలో జర్నలిస్టులదే కీలకపాత్ర అన్నారు. అలాంటి జర్నలిస్టులను భారతరత్న, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సత్కరించుకోవడం, వారికి అంబేద్కర్ ఎక్సకెన్సీ అవార్డులను అందించి గౌరవ...

అందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలి

అందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలి ఏరువాక టెక్నాలజీస్‌ సీఈవో శ్రీరామ్‌ రావి ఏరువాక విద్యార్థులందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలని ఏరువాక టెక్నాలజీస్‌ సీఈవో శ్రీరామ్‌ రావి ఏరువాక అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఈసెల్‌ ఆధ్వర్యంలో ‘‘ ఇట్స్‌ మై స్టోరీ’’ అనే ఇతివృత్తంతో స్ఫూర్తిదాయకమైన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏరువాక టెక్నాలజీస్‌ సీఈవో శ్రీరామ్‌ రావి మాట్లాడుతూ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలని భావించే విద్యార్థులు వినియోగదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. విద్యార్థులు విదేశాలకు వెళ్లే బదులు దేశంలోని ఉండి వివిధ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను స్థాపించి, దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపవచ్చునన్నారు. ప్రతి విద్యార్థి ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నికల్‌ నాలెడ్జ్, నైపుణ్యాభివృద్ధితోనే జీవితంలో మంచి ఉపాధిని, ఉన్నత స్థానాలను పొందగలరని, కేవలం మార్కులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా విషయపరిజ్ఞానం చాలా అవసరమని అన్నారు.

నేడు భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పురస్కార ప్రదానోత్సవ సభ

నేడు భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పురస్కార ప్రదానోత్సవ సభ   - అంబేద్కర్ జయంతి సందర్భంగా జర్నలిస్ట్ కు అంబేద్కర్ ఎక్స్ లెన్సీ అవార్డుల పేరుతో సత్కారం  - టాలెంట్ ఎక్స్ ప్రెస్, శ్రీశ్రీ మీడియా , అషేర్ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో  తెవాలి. భారత రత్న, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని మీడియా సంస్థలు టాలెంట్ ఎక్స్ ప్రెస్, శ్రీశ్రీ మీడియా, స్వచ్ఛంద సేవా సంస్థ ఆషేర్ ఫౌండేషన్ నిర్వహణలో, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం వారం స్థానిక పుట్టి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో ఉత్తమ సేవలందించిన జర్నలిస్ట్ లకు అంబేద్కర్ ఎక్సలెన్సీ పురస్కారాలను ప్రధానం చేయనున్నట్లు నిర్వహకులు కనపర్తి రత్నాకర్ ప్రకటనలో మంగళవారం తెలిపారు. సాంయంత్రం నాలుగు గంటలకు జరగనున్న సభలో ఆతిధులుగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హెనీ క్రిస్టినాసురేష్, స్థానిక శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్, ఐ అండ్ పిఆర్ జాయింట్ డైరెక్టర్ తేళ్ళ కస్తూరి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. అనిత, నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్, డాక్టర...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థికి పీహెచ్‌డీ  మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఇందుకూరి చంద్రశేఖర్‌ రెడ్డి  అనే విద్యార్థికి తమ యూనివర్సటీ   పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఎఫెక్ట్‌ ఆఫ్‌ గ్రాఫైన్‌ ఆక్సైడ్‌ ఆన్‌ మైక్రోస్ట్రక్చర్, మెకానికల్‌ అండ్‌ డ్యూరబిలిటీ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ సిమెంట్‌ కాంపోసైట్‌ మెటీరియల్‌’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని  సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఎన్‌.రూబెన్‌  గైడ్‌గా  వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన పరిశోధనలో భాగంగా మొత్తం ఎస్‌సీఐ 4, స్కూపస్‌ జర్నల్‌ పబ్లికేషన్‌ 2, 4 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. డాక్టరేట్‌ పొందిన ఇందుకూరి చంద్రశేఖర్‌ రెడ్డిను  విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు అభినందించారు.

జ్యోతిరావు పూలే 195 వ జయంతి వేడుకలు

జ్యోతిరావు పూలే 195  వ జయంతి వేడుకలను తెనాలి బార్ అసోసియేషన్ హాల్లో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో దాసరి శ్రీధర్ ప్రెసిడెంట్ సెక్రటరీ సోలార్ శంకర పరి స రవీంద్ర బాబు కే వాసు గుమ్మడి రవిరాజు మధిర సురేష్ బాబు రాజారామ్ సోలా శంకర్ వేణుగోపాల్ పాల్గొని మహాత్మ జ్యోతిరావు పూలే సంఘసంస్కర్త అని ఆయన సేవలను కొనియాడారు

వేమూరు శాసనసభ్యులు శ్రీ మేరుగ నాగార్జున గారు రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా శుభాకాంక్షలు..

ఆస్తుల కంటే గుణం ముఖ్యం

ఆస్తుల కంటే గుణం ముఖ్యం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ క్యాంపస్‌ రిలేషన్స్‌ హెడ్‌ ఆశిష్‌ భల్లా జీవితాన్ని తేలికగా తీసుకోవద్దు: టీవీఎస్‌ సుందరం ఫాస్ట్నర్స్‌ లిమిటెడ్‌ సీనియర్‌ ప్లాంట్‌ ఇంచార్జ్‌ హెచ్‌ఆర్‌ పవన్‌కుమార్‌ అరవల్లి విజ్ఞాన్‌లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మానం ఆకట్టుకున్న శ్రీరామనవమి వేడుకలు చదువు, ఆస్తుల కంటే మనిషికి గుణం ముఖ్యమని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ క్యాంపస్‌ రిలేషన్స్‌ హెడ్‌ ఆశిష్‌ భల్లా తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో చదువుతూ ఈ ఏడాది ప్రాంగణ ఎంపికల ద్వారా ఆయా సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆదివారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఘన సత్కారం కార్యక్రమం నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూనివర్సిటీలో ఈ ఏడాది మొత్తం 1314 మంది విద్యార్థులు ప్రాంగణ ఎంపికల ద్వారా 85 కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. మొత్తం మీద 90  శాతం మంది విద్యార్థులు ఆయా సంస్థల్లో కొలువులు కొల్లగొట్టారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులందరినీ ఆదివారం ఘనంగ...

తెనాలిలో బెస్ట్ బేకరీ, స్వీట్స్ నూతన ప్రారంభం

తెనాలిలో బెస్ట్ బేకరీ, స్వీట్స్ నూతన ప్రారంభం తెనాలి: స్థానిక చెంచుపేటలో కేరళ వ్యాపారవేత్తలు నూతనం గా ఏర్పాటు చెందిన బెస్ట్ బేకరీ, స్వీట్స్ సంస్థను శనివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మునిసిపల్ ఛైర్పర్సన్ సయ్యద్ కాలేదా నసీమ్  రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెనాలిలో బేకరీ ని ప్రారంభించడం అభినందనీయం అన్నారు. నాణ్యమైన ప్రదార్ధాలను, భిన్నమైన రుచులతో అందించి వినియోగదారుల మన్ననలు పొందాలన్నారు. వ్యాపారంలో ఉన్నత స్థాయిని అందుకోవాలని ఆకాంక్షించారు.  నిర్వాహకులు షీహాబ్, ముస్తఫా, నూఫాల్, ఫసల్ , కౌనిలర్లు జి. మానస రెడ్డి, బోయపాటి అరుణ, దర్శకుడు రత్నాకర్, శ్రీ శ్రీ మీడియా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఏలూరు లో చిత్రపరిశ్రమ కు సంబంధించిన వారితో 07-04-22 వ తేదీ ఇంటరాక్షన్ మీట్ ఏర్పాటుచేశారు.. ఈ కార్యక్రమంలో చిత్రపరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది... ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ తరుపున ఏలూరు జిల్లా కోఆర్డినేటర్ గా చప్పిడి సత్యనారాయణను నియమించడం జరిగింది.. ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ  రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం  రాయితీలు ఇస్తున్నదని, వాటన్నిటిని జిల్లాల వారీగా  ప్రజల దృష్టికి తీసుకెళ్లి, వారిలో అవగాహన పెంచి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కు మద్దతుగా పనిచేస్తామని తెలియజేశారు.. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత, జర్నలిస్ట్ కూనిరెడ్డి శ్రీనివాస్, ఛాంబర్ జాయింట్ సెక్రటరీ డి.యస్.యన్.ప్రసాద్, ఈ.సి.మెంబర్ అబీడ్ హుస్సేన్, నిర్మాత పి.వి.ఆర్ (వెంకట్) పాల్గొన్నారు.

విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో ఘనంగా వరల్డ్‌ హెల్త్‌ డే

విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో ఘనంగా వరల్డ్‌ హెల్త్‌ డే చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో వరల్డ్‌ హెల్త్‌ డేను పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వరల్డ్‌ హెల్త్‌ డేను పురస్కరించుకుని విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో ఉన్నత భారత అభియాన్‌ దత్తత గ్రామమైన నారాకోడూరు గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో హెల్త్‌ అవేర్‌నెస్‌ క్యాంప్‌ను నిర్వహించామని తెలిపారు. ఈ అవేర్‌నెస్‌ కార్యక్రమాన్ని ‘‘ అవర్‌ ప్లానెట్‌– అవర్‌ హెల్త్‌’’ అనే ఇతివృత్తంతో విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని గుంటూరులోని నీడ్స్‌ బ్లడ్‌ బ్యాంక్‌ వారి సహకారముతో నిర్వహించారు. కార్యక్రమంలో దాదాపు 171 మంది విద్యార్థులు రక్తదానం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సాక్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పీ.సౌజన్య, ఇతర విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మనసును తాకింది

నెలవంక రేతిరి  నిదురను దోచింది  కనురెప్పల పాట  మనసును తాకింది ! నడిరేయి జాములో కొలిక్కి రాని వాక్యాలు పురిటి నొప్పుల్లో సంధి కొడుతున్న భావాలు ! పీడ కలగన్న ఏ పిట్టో పల్లవి లేని పాట ఆలపించింది ఆద మరచీ నిదురోని గుండె సడి లయ తప్పింది ! తెలవని  మత్తు ఏదో మగతై రెప్పలపై వాలింది కదిలీ కదలని కలం అసంపూర్ణ కవితను మిగిల్చింది ! ఇక ఏ వేకువ వెన్నలో చీకటి రాత్రులను చిదిమి తూరపు ఆకాశాన ఇనబింబమై పరిపూర్ణ కవితను చిత్రించాలి ! సురేంద్ర రొడ్డ 9491523570

విజ్ఞాన్స్‌ వర్సిటీ నూతన వీసీగా ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌

విజ్ఞాన్స్‌ వర్సిటీ నూతన వీసీగా ప్రొఫెసర్‌  _పీ.నాగభూషణ్‌ గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ నూతన వైస్‌ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈయన ప్రయాగరాజ్‌లోని ఐఐఐటీ–అలహాబాద్‌ డైరక్టర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించి గుంటూరులోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు 5వ వైస్‌ చాన్సలర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పదవీ కాలంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీను ఉన్నత స్థానాలకు తీసుకెళ్తానన్నారు. యూనివర్సిటీలో అకడమిక్, రీసెర్చ్, మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తానన్నారు. విద్యార్థులకు, అధ్యాపకులకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంగా పనిచేస్తానని తెలియజేసారు. ఈయన గతంలో ఐఐటీ–లక్నో మెంటర్‌ డైరక్టర్‌గా, యూనివర్సిటీ ఆఫ్‌ మైసూరుకు చీఫ్‌ నోడల్‌ ఆఫీసర్‌తో పాటు సెంటర్‌ ఫర్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకు డైరక్టర్‌గా కూడా పనిచేశారు. ఈయన పదవీ కాలంలో ఐఐఐటీ అలహాబాద్‌లో హై పర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌ అండ్‌ క్లౌడ్‌ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ లింక్డ్‌ కంటిన్యూస్‌ అసెస్‌మెంట్‌ అం...