ఇళ్ల స్థలాల కోసం 11 వేల మంది జర్నలిస్టులు వెయిటింగ్

ఇళ్ల స్థలాల కోసం 11 వేల మంది జర్నలిస్టులు వెయిటింగ్

ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో సానుకూల నిర్ణయం

అందరి సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర సమాచార, పౌర  సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ

సింహాచలం...

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు
సంభందించిన  పెండింగ్ సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో చర్చించడం జరుగుతుందని రాష్ట్ర సమాచార, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు.
ఆదివారం ఉదయం సింహాద్రినాధుడు ను  దర్శించుకున్న అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, సహచర జర్నలిస్టులు బృందం జర్నలిస్టుల ఇళ్లస్థలాలకు సంబంధించిన సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మూడు సెంట్ల స్థలము,  హెల్త్ కార్డు, ప్రమాద బీమా పాలసీ తో పాటు కలిపి
ఒక ప్యాకేజీ గాఅందిస్తామని ముఖ్యమంత్రి గతములో హామీ ఇవ్వడం జరిగిందని, దానిని నెరవేర్చే దిశగా కృషి చేయాలని మంత్రిని  కోరారు. ఒక్క విశాఖనగరములోనే  సుమారు 1200 మంది జర్నలిస్ట్ లు ఇళ్ళ స్థలాల కోసం ఎదురు చూస్తున్నారనీ శ్రీను బాబు మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళారు..ఇందుకు  మంత్రి సానుకూలంగా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల మంది కి
పైగా జర్నలిస్టులు  ఇళ్ళ స్థలాల కోసం ఎదురుచూస్తున్నట్లు  ప్రాథమిక అంచనా తమ వద్ద ఉందన్నారు.. అన్ని వర్గాలతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి కూడా తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.. జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమగ్రము గా  చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.. త్వరలోనే ఆయా  పెండింగ్ అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి తో సమావేశం కాబోతున్నట్లు మంత్రి వివరించారు.. రాష్ట్ర  ప్రజలకు మరింత  మంచి పాలన అందించే విధముగా ముఖ్య మంత్రికి , తమకు ఆ భగవంతుడు అవసరమైన శక్తి నీ ప్రసాదించాలని స్వామి నీ కోరుకోవడం జరిగిందన్నారు...