ఆగస్టు 14,15 తేదీల్లో షార్ట్ ఫిల్మ్ పోటీలు

ఆగస్టు 14,15 తేదీల్లో షార్ట్ ఫిల్మ్ పోటీలు

 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
పోస్టర్ ఆవిష్కరిస్తున్న తెలుగు షార్ట్ ఫిల్మ్ సంఘ ప్రతినిధులు కృష్ణలంక(విజయవాడ తూర్పు): స్వాతంత్ర్య వజోత్సవాన్ని పురస్క రించుకుని ఆగస్టు 14, 15 తేదీల్లో షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నా మని తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసి యేషన్ ప్రధాన కార్యదర్శి డి.వి. రాజు పేర్కొన్నారు. విజయవాడ గవర్నర్ పేటలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్ర వారం షార్ట్ ఫిల్మ్ పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరుగుతున్న దురాచా రాలను వ్యతిరేకిస్తూ షార్ట్ ఫిల్మ్ లు ఉండాలన్నారు. షార్ట్ ఫిల్మ్ నిడివి 10 నిమిషాలకు మించరాదని, కుల మతాలకు అతీతంగా, అశ్లీలతకు తావు లేకుండా ఉండాలన్నారు. ప్రదర్శనకు ఎంపికైన 30 చిత్రాలకు నగదు బహుమతి, మెమొంటో ఇవ్వ నున్నట్టు చెప్పారు. షార్ట్ ఫిల్మ్ లను జూలై 31 లోగా పంపాలని, వివరా లకు 93911 63508 నంబర్లో సం ప్రదించాలని కోరారు. ఈ కార్యక్ర మంలో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్, కమిటీ సభ్యులు ప్రేమ చం ద్, అశోక్, జగదీష్, ఐజాక్ న్యూటన్ పాల్గొన్నారు.