విజ్ఞాన్స్‌లో ఘనంగా జాతీయస్థాయి ఫుడో–ఫీస్టా 2కే22

విజ్ఞాన్స్‌లో ఘనంగా జాతీయస్థాయి ఫుడో–ఫీస్టా 2కే22

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో నేషనల్‌ లెవల్‌ ‘‘ ఫుడో–ఫీస్టా 2కే22’’ను శనివారం ఘనంగా నిర్వహించారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెనాలిలోని డబుల్‌ హార్స్‌ జనరల్‌ మేనేజర్‌ క్రిష్ణ ప్రసాద్‌ ఎన్‌వీ పోలిశెట్టి మాట్లాడుతూ విద్యార్థులందరూ సాంప్రదాయ ఆహారపు అలవాట్లను భవిష్యత్‌ తరాలకు అందజేయాల్సిన బాధ్యతను తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలన్నారు. అందుకు మంచి ఆహారం, వ్యాయామం, నిద్ర అవసరమని తెలిపారు. శ్రద్ధగా చదువుకోవాలని చెప్పారు. ఆరోగ్యంగా ఉండి, శ్రద్ధగా చదువుకునే విద్యార్థులు జీవితంలో ఏ అవకాశాన్నయినా అందిపుచ్చుకోగలరని, ఉన్నత శిఖరాలను చేరుకోగలరని వివరించారు. లియో గ్లోబల్‌ ఓవర్‌సీస్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ లగడపాటి వీరాంజనేయులు మాట్లాడుతూ ఫుడ్‌ టెక్నాలజీ పూర్తిచేసిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. విద్యార్థులు లక్ష్యసాధన కోసం పాటుపడాలని అన్నారు. లక్ష్యాలను ఏర్పరచుకోవటంతో పాటుగా విద్యార్థులు క్రమశిక్షణ, చిత్తశుద్దితో ప్రయత్నిస్తే ఎంతటి విజయాలనైనా సొంతం చేసుకుంటారని చెప్పారు. ప్రధానంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని వారి వారి రంగాల్లో చోటు చేసుకుంటున్న నూతన ఆవిష్కరణలపై పట్టుసాధించగలిగిన ప్రతి విద్యార్థి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారని తెలిపారు. అనంతరం ఫుడో–ఫీస్టా 2కే22లో భాగంగా విద్యార్థులకు ఫుడ్‌ కార్వింగ్, ఈటింగ్‌ కాంపిటీషన్, ప్యాకోడుస్, బ్లైండ్‌ ఫుడ్, ఫైర్‌లెస్‌ కుకింగ్, వ్యాసరచన, క్విజ్, జామ్‌ ( జస్ట్‌ ఏ మినిట్‌), డిబేట్, మోనో యాక్షన్‌ వంటి పోటీలను నిర్వహించారు. అంతేకాకుండా లోగో క్రియేషన్, షార్ట్‌ ఫిల్మ్, ఫుడ్‌ ఫోటోగ్రఫీ. పోస్టర్‌ ప్రజేంటేషన్, బెస్ట్‌ క్యాప్షన్‌ విన్స్, స్టఫ్‌ ద బ్లాంక్, థింక్‌ క్వెస్ట్‌ వంటి పోటీలను కూడా నిర్వహించారు. కార్యక్రమంలో ఆక్వా అండ్‌ స్పైసిస్‌ బిజినెస్‌ హెడ్‌ సంజీవ్‌ బిస్త్, ఫుడ్‌ టెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రమేష్‌ నాయుడు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.