పాత్రికేయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

పాత్రికేయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా 

- అంబేద్కర్ ఎల్టెన్సీ అవార్డ్స్ ప్రదానోత్సవంలో 
  జెడ్పీ చైర్ పర్సన్ క్రిస్టినా 

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ప్రభుత్వానికి, ప్రజలకు మద్య వారధిగా ఉంటూ నిత్యం ప్రజాశ్రేయస్సుకు పాటుపడే పాత్రికేయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని జిల్లా పరిషత్ చైర్ పర్సస్ కత్తెర హెనిక్రిస్టీనా అన్నారు. 
టాలెంట్ ఎక్స్ ప్రెస్, శ్రీశ్రీమీడియా, అ షేర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక పుట్టి నాగేశ్వరరావు కల్యాణ మండపంలో బుధవారం రాత్రి ఎంపిక చేసిన జర్నలిస్టులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్స్ లెన్సీ 
పురస్కారాలను  ప్రధానం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సభకు టాలెంట్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్, ఏపిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి, దర్శకుడు కనపర్తి రత్నాకర్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన క్రిస్టినా  మాట్లాడుతూ అస్పృశ్యతపై తన గళాన్ని వినిపించేందుకు స్వతహాగా అంబేద్కర్ పత్రికలను స్థాపించారన్నారు. ఐఅండ్ పిఆర్ డిప్యూటీ  డైరెక్టర్ తేళ్ళ కస్తూరి మాట్లాడుతూ పాత్రికేయుల సేవలు ప్రశంసనీయం అన్నారు. ఏపిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర  ప్రధానకార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజల పక్షాన నిలిస్తే అన్ని వర్గాలకు న్యాయం  జరుగుతుందన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ కో-ఆర్డినేటర్  డాక్టర్ జి.అనిత మాట్లాడుతూ  భారతరత్న, డాక్టర్ బి.ఆర్ .అంబేడ్కర్ దార్శనికుడు అని కొనియాడారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జియాలజీ విభాగాధిపతి డాక్టర్ పి.జె.రత్నాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలన్నారు. జివిఆర్ఆండ్ కాలేజి అకడమిక్స్ డీన్ డాక్టర్ కనపర్తి అబ్రహాంలింకన్ మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ అంబేద్కర్ అన్నారు.డాక్టర్ అంబేద్కర్  ఎడిటర్, జర్నలిస్ట్ గా కూడా పనిచేసి ప్రజల పక్షాననిలిచారన్నారు. ఆ స్ఫూర్తితో నేటి జర్నలిస్టులు పనిచేయాలన్నారు. తెనాలి డివిజన్ లో ఫెడరేషన్ జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ (కర్నూలు) వి.యెహెస్కేలు మాట్లాడుతూ కలం కార్మికులు జర్నలిస్టులని, ప్రజలను ప్రగతివైపుకు నడిపించేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఏపీ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కృష్ణా జిల్లా కన్వీనర్ అబ్దుల్ హలీమ్
జర్నలిస్టుల పై సామాజిక బాధ్యత ఎంతో ఉందన్నారు. సభకు అధ్యక్షత వహించిన రత్నాకర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిస్కారానికి ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్స్ లెన్సీ పురస్కారాలను సీనియర్  జర్నలిస్టులు తేళ్ళ రవీంద్రబాబు, గురిందపల్లి ప్రభాకరరావు,  మంచికలపూడి రవికుమార్, గుమ్మడి ప్రకాశరావు, ఎస్.ఎస్ జహీర్ లకు అతిధుల చేతులుమీదిగా అందించారు. పూలమాలలు, జ్ఞాపిక, సాలువాలతో ఘనంగా సత్కరించారు. కనపర్తి ఫౌండేషన్ సభ్యులు మధుకర్, పవన్, ప్రముఖ శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, విద్యుత్  నిర్వాహక ఉద్యోగుల సంఘ నాయకులు గురుబ్రహ్మం, అడపా సంపత్ తదితరులు పురస్కారాలు అందుకున్న జర్నలిస్టులను అభినందించారు.కార్యక్రమాన్ని
ఏఏపిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి శ్యామ్ సాగర్, కార్యదర్శి పుట్ల పున్నయ్య, వేమూరు నియోజకవర్గ అధ్యక్షుడు ఎం. సుబ్బారావు, కార్యదర్శి  శేషిరెడ్డి, శ్రీ శ్రీ మీడియా శ్రీకాంత్ లు పర్యవేక్షించారు.
నాయకులు డి. కోటేశ్వరరావు, సాంబశివరావు, లక్ష్మణ్, బాబు, ప్రేమకుమార్, నాగరాజు
వెంకటేశ్వరరావు, వి.భూషణం, చందు, శ్యాంమ్యూల్ , సభ్యులు  పాల్గొన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, సహజకవి అయినాల మల్లేశ్వరరావు అతిధులు స్వాగతించారు.