విజ్ఞాన్స్‌లో కళ్యాణమస్తు సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో కళ్యాణమస్తు సినిమా యూనిట్‌ సందడి
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం బోయపాటి అగస్త్య సమర్పణలో ఎస్‌ఎమ్‌ఎస్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మించిన ‘‘కళ్యాణమస్తు’’ సినిమా యూనిట్‌ సందడి చేసింది. విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు పుట్టినరోజుతో పాటు ఇంటర్నేషనల్‌ డ్యాన్స్‌ డేనే పురస్కరించుకుని కళ్యాణమస్తు సినిమాలోని కొరియోగ్రాఫర్ అమ్మ సుధీర్ గోగినేని నృత్యరీతులు అందించిన
‘‘ముక్కుపుడక’’ అనే సాంగ్‌ను అట్టహాసంగా లాంచ్‌ చేశారు. శేఖర్‌ వర్మ, వైభవి రావ్‌ హీరో హీరోయిన్లుగా  ఓ.సాయి దర్శకత్వంలో బోయపాటి రఘుబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘ముక్కుపుడక’’ అనే సాంగ్‌ను ప్రముఖ గాయని మంగ్లీ, గాయకుడు రఘురామ్‌ ఆలపించారు. ఈ సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఆర్‌.ఆర్‌ ధృవన్, కెమెరామెన్‌గా మల్లికార్జున్‌ నారగాని, లిరిక్‌ రైటర్‌గా అలరాజు పనిచేశారు. హీరో శేఖర్‌ వర్మ మాట్లాడుతూ మూవీ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిర్మించామని... చిత్రం తప్పకుండా అందర్నీ అలరిస్తుందన్నారు. సినిమాలో ట్విస్టులు, కామెడీ, ఎమోషన్స్, డ్రామా, ఫైట్స్‌ తప్పకుండా నచ్చుతాయన్నారు. నిర్మాత బోయపాటి రఘు బాబు గారు మాట్లాడుతూ మా సినిమాలోని పాటని ఇక్కడ లాంచ్‌ చెయ్యడం చాలా ఆనందంగా ఉందన్నారు. చిన్న సినిమా అయినా ఖర్చుకు ఎక్కడా తగ్గకుండా సినిమా తీశామని తెలిపారు. జూన్‌ నెలాఖరులోపు సినిమా మీ ముందుకు వస్తుందన్నారు. దర్శకులు ఓ.సాయి మాట్లాడుతూ నన్ను, నా కథని నమ్మి ఈ సినిమాని నిర్మించిన రఘుబాబు గారికి రుణపడి ఉంటానని తెలిపారు. విజయవాడ, బొబ్బిలి, సీలేరు, మైలవరం తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపామన్నారు. ‘‘ముక్కుపడక’’ పాటను పచ్చని ప్రకృతి అందాలు, సెలయేర్లు, కొండలు మధ్య చిత్రీకరించామని తెలియజేసారు.