విజ్ఞాన్స్‌ విద్యార్థికి ప్రతిష్టాత్మక జాతీయస్థాయి ఫెలోషిప్‌

విజ్ఞాన్స్‌ విద్యార్థికి ప్రతిష్టాత్మక జాతీయస్థాయి ఫెలోషిప్‌

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ విభాగానికి చెందిన మూడో సంవత్సరం విద్యార్థి బిల్లపాటి మణికంఠకు జాతీయస్థాయి ఫెలోషిప్‌ లభించిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐఏఎస్‌సీ–ఐఎన్‌ఎస్‌ఏ–ఎన్‌ఏఎస్‌ఐ సమ్మర్‌ రీసెర్చ్‌ ఫెల్లోషిప్‌–2022కు మణికంఠ ఎంపికైనట్లు వెల్లడించారు. ఈ ఫెల్లోషిప్‌ను ఇండియన్‌ అకడమీ ఆఫ్‌ సైన్సెస్, ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకడమీ, నేషనల్‌ అకడమీ ఆఫ్‌ సైన్స్‌ ఇండియా వంటి 3 అకాడమీలు కలిపి ఈ ఫెలోషిప్‌ను అందజేస్తారని పేర్కొన్నారు. బిల్లపాటి మణికంఠకు భోపాల్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ అకడమీలోని డాక్టర్‌ నితిన్‌ టీ పటిల్‌ గైడ్‌గా వ్యవహరించున్నారని తెలియజేసారు. 8 వారాల పాటు జరిగే ఈ ప్రతిష్టాత్మక జాతీయస్థాయి ఫెలోషిప్‌కు ఎంపికైనందుకు మణికంఠకు రూ.25,000 లు స్టైఫండ్‌ అందిస్తారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎంపికచేసిన 140 మంది విద్యార్థుల్లో మన ప్రాంతానికి చెందిన విద్యార్థి మణికంఠ ఒక్కడేనని తెలియజేసారు.  జాతీయస్థాయి ఫెలోషిప్‌కు ఎంపికైన బిల్లపాటి మణికంఠను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ఫార్మసీ విభాగాధిపతి డాక్టర్‌ చీమకుర్తి జితేంద్ర, కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ దేవనూరి నాగరాజు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు అభినందించారు.