విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్, విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ సంయుక్త సహకారంతో డీఎస్టీ స్పాన్సర్డ్‌ నేషనల్‌ లెవల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ను వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ వైబ్రేషన్‌ బేస్డ్‌ ప్రొడక్టర్‌ క్వాలిటీ అండ్‌ కండీషన్‌ మోనిటరింగ్‌ సిస్టమ్స్‌ ఇన్‌ అడ్వాన్స్‌›్డ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఎస్‌టీయూటీఐ ప్రోగ్రామ్‌–2021’’ అనే అంశంపై ఈ సెమినార్‌ను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గీతం యూనివర్సిటీ ఎస్‌టీయూటీఐ ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ బల్లా శ్రీనివాస ప్రసాద్‌ మాట్లాడుతూ వైబ్రేషన్‌ లెవల్‌ ఆధారిత ఎక్విప్‌మెంట్‌లో పట్టు సాధించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు.  కండీషన్‌ మోనిటరింగ్‌ సిస్టమ్స్‌ ఇన్‌ అడ్వాన్స్‌›్డ మ్యానుఫ్యాక్చరింగ్‌లో పరిశోధనలు చేయడానికి విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ విద్యార్థుల ఆలోచనలు పదునుగా ఉండాలన్నారు. సాంకేతికత పరవళ్లు తొక్కుతున్న తరుణంలో విద్యార్థులకు, అధ్యాపకులకు పరిశోధనా సామర్థ్యాలు పెంపొందించేందుకు ఇలాంటి సదస్సులు ఎంతగానో దోహదపడుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు కొత్త కొత్త పరిజ్ఞానాలతో అన్ని రంగాలకు ఉపయోగపడే పరికరాలను తయారుచేయాలని సూచించారు. నేర్చుకున్న పాఠాలను ప్రయోగాలుగా మలిచే సామర్థ్యాలను విద్యార్థులు పెంచుకోవాలని చెప్పారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బల్లా శ్రీనివాస ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు.