మనసును తాకింది


నెలవంక రేతిరి 
నిదురను దోచింది 
కనురెప్పల పాట 
మనసును తాకింది !

నడిరేయి జాములో
కొలిక్కి రాని వాక్యాలు
పురిటి నొప్పుల్లో
సంధి కొడుతున్న భావాలు !

పీడ కలగన్న ఏ పిట్టో
పల్లవి లేని పాట ఆలపించింది
ఆద మరచీ నిదురోని
గుండె సడి లయ తప్పింది !

తెలవని  మత్తు ఏదో
మగతై రెప్పలపై వాలింది
కదిలీ కదలని కలం
అసంపూర్ణ కవితను మిగిల్చింది !

ఇక ఏ వేకువ వెన్నలో
చీకటి రాత్రులను చిదిమి
తూరపు ఆకాశాన ఇనబింబమై
పరిపూర్ణ కవితను చిత్రించాలి !

సురేంద్ర రొడ్డ 9491523570