విజ్ఞాన్స్‌ లారాకు ప్రతిష్టాత్మక ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌

విజ్ఞాన్స్‌ లారాకు ప్రతిష్టాత్మక ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌
చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు ప్రతిష్టాత్మక ఎన్‌బీఏ( నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌) అక్రిడిటేషన్‌ సాధించిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఎన్‌బీఏ నుంచి 4 అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ లభించడం గర్వకారణమన్నారు. అక్రిడిటేషన్‌ లభించిన కోర్సులలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. లారా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ మాట్లాడుతూ ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌కు సంబంధించిన తనీఖీ బృందం విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలో 2022 సంవత్సరం మార్చి 4 నుంచి మూడు రోజుల పాటు పర్యటించిందన్నారు. తనీఖీ బృందం విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు అందించే విద్యా విధానం, సిలబస్‌ కంటెంట్, టీచింగ్‌ మెథడాలజీ, అకాడమిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్టులు, పబ్లికేషన్స్, ప్లేస్‌మెంట్స్, ఇంటర్న్‌షిప్స్, స్పోర్ట్స్, హాస్టల్‌ వసతి, విద్యార్థుల అచీవ్‌మెంట్స్, అత్యాధునిక ల్యాబ్‌ ఎక్విప్‌మెంట్‌లన్నింటిని మూడు రోజులపాటు విస్తృతంగా పరిశీలించిందన్నారు.   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అత్యధిక స్థాయిలో గ్రాంట్లు, ప్రాజెక్టులు పొందటానికి దోహదపడుతుందన్నారు. అక్రిడిటేషన్‌ ఉండటం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లో విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు స్థానం లభిస్తుందన్నారు. విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ మూడు సంవత్సరాలు పాటు లభించిందని తెలియజేసారు. కార్యక్రమంలో లారా కళాశాలకు చెందిన ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.