విజ్ఞాన్స్‌ లారా అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ లారా అధ్యాపకుడికి పీహెచ్‌డీ


చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలోని ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన అధ్యాపకుడు షేక్‌ గౌస్‌ భాషకు విజ్ఞాన్స్‌ యూనివర్సటీ   పీహెచ్‌డీ పట్టా అందించిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్ర కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఫెర్మార్మెన్స్‌ అనాలిసిస్‌ ఆఫ్‌ మోడిఫైడ్‌ థర్టీన్‌ లెవల్‌ ఇన్వెర్టర్‌ ఫర్‌ షంట్‌ యాక్టివ్‌ పవర్‌ ఫిల్టర్‌’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈఈఈ డిపార్ట్‌మెంట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎం.సుబ్బారావు, విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలోని ప్రొఫెసర్‌ ఎం.వెంకటేసన్‌లు సంయుక్త గైడ్‌లుగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన పరిశోధనలో భాగంగా మొత్తం 1 ఐఈఈఈ ఎస్‌సీఐ, 2 ఈఎస్‌ఐ, 3 స్కూపస్‌ జర్నల్‌ పబ్లికేషన్, 2 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్లు, ఒకటి బుక్‌ చాప్టర్‌ పబ్లిష్‌ చేశారని తెలియజేసారు. డాక్టరేట్‌ పొందిన షేక్‌ గౌస్‌ భాషను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్ర కుమార్, ఆయా విభాగాల అధిపతులు, అధ్యాపకులు అభినందించారు.