విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో ఘనంగా వరల్డ్‌ హెల్త్‌ డే

విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో ఘనంగా వరల్డ్‌ హెల్త్‌ డే



చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో వరల్డ్‌ హెల్త్‌ డేను పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వరల్డ్‌ హెల్త్‌ డేను పురస్కరించుకుని విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో ఉన్నత భారత అభియాన్‌ దత్తత గ్రామమైన నారాకోడూరు గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో హెల్త్‌ అవేర్‌నెస్‌ క్యాంప్‌ను నిర్వహించామని తెలిపారు. ఈ అవేర్‌నెస్‌ కార్యక్రమాన్ని ‘‘ అవర్‌ ప్లానెట్‌– అవర్‌ హెల్త్‌’’ అనే ఇతివృత్తంతో విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని గుంటూరులోని నీడ్స్‌ బ్లడ్‌ బ్యాంక్‌ వారి సహకారముతో నిర్వహించారు. కార్యక్రమంలో దాదాపు 171 మంది విద్యార్థులు రక్తదానం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సాక్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పీ.సౌజన్య, ఇతర విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.