ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఏలూరు లో చిత్రపరిశ్రమ కు సంబంధించిన వారితో 07-04-22 వ తేదీ ఇంటరాక్షన్ మీట్ ఏర్పాటుచేశారు.. ఈ కార్యక్రమంలో చిత్రపరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది... ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ తరుపున ఏలూరు జిల్లా కోఆర్డినేటర్ గా చప్పిడి సత్యనారాయణను నియమించడం జరిగింది.. ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ  రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం  రాయితీలు ఇస్తున్నదని, వాటన్నిటిని జిల్లాల వారీగా  ప్రజల దృష్టికి తీసుకెళ్లి, వారిలో అవగాహన పెంచి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కు మద్దతుగా పనిచేస్తామని తెలియజేశారు..
ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత, జర్నలిస్ట్ కూనిరెడ్డి శ్రీనివాస్, ఛాంబర్ జాయింట్ సెక్రటరీ డి.యస్.యన్.ప్రసాద్, ఈ.సి.మెంబర్ అబీడ్ హుస్సేన్, నిర్మాత పి.వి.ఆర్ (వెంకట్) పాల్గొన్నారు.