చురుగ్గా అంబేడ్కర్ స్మృతివనం పనులు

చురుగ్గా అంబేడ్కర్ స్మృతివనం పనులు
- ప్రతి 15 రోజులకు సమీక్ష నిర్వహించాలని 
  మంత్రి మేరుగ నాగార్జున ఆదేశం. 
విజయవాడ స్వరాజ్ మైదానంలో చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం పనులు చురుగ్గా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి మేరుగ నాగార్జున ఆదేశించారు. మంగళవారం సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వచ్చే ఏడాది అంబేడ్కర్ జయంతి నాటికి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిర్మాణ పనులు ప్రగతిపై 15 రోజులకొకసారి సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. పనులు ఆలస్య మవ్వకుండా చర్యలు తీసుకోవాలని.. అలసత్వాన్ని క్షమించబోనని హెచ్చరించారు. పెరుగుతున్న ధర లకు అనుగుణంగా సాంఘిక సంక్షేమ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. అంబేడ్కర్ విదేశీ విద్యా నిధి పథకం కింద విద్యార్థులకు మరింత ప్రయో జనం చేకూర్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 ప్రతిష్టాత్మక యూనివర్సిటీలతో యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకుంటున్నట్లు తెలిపారు.